Kalki 2898 AD : ఏ సిటీలో టికెట్ రేటు ఎంతెంత అంటే..!

Kalki 2898 AD : ఏ సిటీలో టికెట్ రేటు ఎంతెంత అంటే..!

ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898AD రిలీజ్ కి సిద్ధమైంది. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె లీడ్ రోల్స్ లో నటించగా టాలీవుడ్, బాలీవుడ్ అన్న తేడా లేకుండా 

బిగ్ బీ అమితాబ్, కమల్ హాసన్, మోహన్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ కి సంబంధించిన స్టార్స్ ఈ సినిమాలో కీరోల్స్ లో నటించిన నేపథ్యంలో హోల్ ఇండియా అంతా ఈ సినిమా కోసం ఏంఅతగానో ఎదురు చూస్తోంది.

ఈ క్రమంలో కల్కి సినిమా టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ అయిన నిమిషాల్లోనే ఫుల్ అయ్యాయి. టికెట్ రేట్లు కూడా హైప్ కి మించిన రేంజ్ లో ఉన్నాయి.ముంబైలో ఈ సినిమా టికెట్ ఏకంగా 2,300 రూపాయల రికార్డ్ ధరకు అమ్ముతున్నారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో కల్కి సినిమా టికెట్ ధరలు ఇలా ఉన్నాయి:

ముంబయి: రూ.2300

ఢిల్లీ : రూ.1800

హైదరాబాద్: రూ.500

బెంగళూరు: రూ.700

చెన్నై: రూ.200

అహ్మదాబాద్: రూ. 450

చండీగఢ్ : రూ. 250

పూణే: రూ.200

కోల్కతా: రూ.190

కోచి: రూ. 200