ఓవర్సీస్ లో కల్కి సినిమాకి నష్టాలు... ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య లొల్లి..

ఓవర్సీస్ లో కల్కి సినిమాకి నష్టాలు...  ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ల మధ్య లొల్లి..

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి2898 AD సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. పౌరాణిక సైన్స్ ఫిక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ దాదాపుగా రూ.1000 కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ సాధించింది.

కల్కి సినిమాని కొన్న యూఎస్, యూరప్ డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి మధ్య కలెక్షన్ల విషయంలో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రొడక్షన్ హౌస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు పంపించిన ఈ-మెయిల్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. యూఎస్, యూరప్ డిస్ట్రిబ్యూషన్ హక్కులు కోసం రూ.5 కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట.

Also Read :- రానా టాక్ షో ట్రైలర్‌ రిలీజ్

కానీ ఇందులోయూరప్ లోని కొన్ని ప్రాంతాలలో  కల్కి సినిమా సరిగ్గా ఆడకపోవడంతో నష్టాలు వచ్చాయని చెబుతూ కేవలం 3 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన బకాయిలు చెల్లించాలని నిర్మాతలు కోరినప్పటికీ నష్టాలు వచ్చాయని చెబుతూ డిస్ట్రిబ్యూటర్లు పట్టించుకోవడం లేదు. 

వైజయంతి మూవీస్ సంస్థ మాత్రం యూఎస్, యూరప్ లో కల్కి సినిమా దాదాపుగా 1.3 మిలియన్ కలెక్ట్ చేసిందని, కానీ డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలని మోసం చేస్తున్నారని పేర్కొంది. అలాగే 48 గంటల్లోగా మిగిలిన బకాయిలు చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైజయంతి మూవీస్ ప్రొడక్షన్ హౌస్ తెలిపింది.