Rajamouli Records Safe: జక్కన్న రికార్డ్స్ కొట్టడమంటే అంత ఈజీ కాదు బాస్.. కల్కి వల్ల కూడా కాలేదు

Rajamouli Records Safe: జక్కన్న రికార్డ్స్ కొట్టడమంటే అంత ఈజీ కాదు బాస్.. కల్కి వల్ల కూడా కాలేదు

జక్కన్న రికార్డ్స్ కొట్టడమంటే అంత ఈజీ కాదు బాస్. ఒకవేళ కొట్టాలన్నా.. అంత బడ్జెట్, ఆ రేంజ్ హీరో ఉంటే సరిపోదు.. డైరెక్టర్ కూడా రాజమౌళినే అయ్యుండాలి. అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ప్రస్తుతం సినీ లవర్స్ అనుకుంటున్న మాట ఇదే. ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా కల్కి 2898 ఏడీ. ఇండియన్ మైథాలజీ టచ్ తో, ఫ్యూచరిస్టిక్ మూవీగా హాలీవుడ్ రేంజ్ లో వచ్చిన ఈ సినిమా జూన్ 27న విడుదలైంది. 

 భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు.. సినిమాకు యునానిమస్ పాజిటీవ్ టాక్ వచ్చింది. దాంతో.. కల్కి సినిమా ఖచ్చితంగా ఇండియా వైడ్ గా ఉన్న అన్ని రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది అని ఫిక్స్ అయ్యారు అంతా. అయితే.. అందరి దృష్టి మాత్రం దర్శధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మీదే పడింది. ఓపెనింగ్ డే రోజు కల్కి సినిమా ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుందా అని. 

కానీ, ఆలా జరుగలేదు. కనీసం రాజమౌళి నుండి వచ్చిన గత చిత్రం బాహుబలి 2 రికార్డ్స్ కూడా టచ్ చేయలేకపోయింది. కల్కి మూవీ ఓపెనింగ్ డే కేవలం రూ.191 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. కానీ, మొదటిరోజు బాహుబలి 2 రూ.217, ఆర్ఆర్ఆర్ రూ.223 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టాయి. దీంతో.. రాజమౌళి రికార్డ్స్ ను బ్రేక్ చేయడం అంటే అంత ఈజీ కాదు బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. కల్కి వర్కింగ్ డేలో విడుదలవడం, అదేరోజు టీ ట్వంటీ వర్ల కప్ లో భాగంగా ఇండియా, ఇంగ్లాండ్ సెమి ఫైనల్ మ్యాచ్ ఉండటంతో ఆ ఎఫెక్ట్ కల్కి ఓపెనింగ్స్ పై పడిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కారణం ఏదైనా.. ఆర్ఆర్ఆర్ రికార్డ్ మాత్రం బ్రేక్ అవలేదు. ఆ రికార్డ్స్ బ్రేక్ అవ్వాలంటే మళ్ళీ రాజమౌళి, మహేష్ బాబు సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే అని అనుకుంటున్నారంతా.