రివ్యూ: కల్కి

రివ్యూ: కల్కి

రివ్యూ: కల్కి

రన్ టైమ్ :2 గంటల 22 నిమిషాలు

నటీనటులు: రాజశేఖర్,అదా శర్మ,రాహుల్ రామకృష్ణ,శత్రు,అశుతోష్ రాణా,నందితా శ్వేతా,సిద్దూ జొన్నలగడ్డ,నాజర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర

మ్యూజిక్ : శ్రవణ్ భరద్వాజ్

కథ: సాయి తేజ

కథనం: స్క్రిప్ట్ విలే

నిర్మాతలు: శివానీ శివాత్మిక మూవీస్,సి.కళ్యాణ్

 దర్శకత్వం: ప్రశాంత్ వర్మ

రిలీజ్ డేట్ : జూన్ 28,2019

కథేంటి:

ఈ మూవీ 1980 ల్లో తెలంగాణ లోని కొల్లాపూర్ గ్రామంలో జరిగే కథ.ఓ దొరల కుటుంబానికి సంబంధించిన శేఖర్ బాబు (సిద్దూ జొన్నలగడ్డ) అనే యువకుడిని హత్య చేస్తారు.అది వాళ్ల అన్నయ్యే చేయించాడని అనుమానం ఉంటుంది అందరికీ.ఆ హత్య చేధించడానికి పోలీసాఫీసర్ కల్కి (రాజశేఖర్) రంగంలోకి దిగుతాడు.ఇంతకా హత్య ఎవరు చేసారు.కల్కి ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడనేది కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్:

ఇలాంటి పోలీసాఫీసర్ పాత్రలకు చక్కగా న్యాయం చేసే రాజశేఖర్ తన పాత్రలో ఒదిగియాడు.కాకపోతే కాస్త ఏజ్ డ్ గా కనిపించాడు.తన మేకప్ కూడా ఓవర్ అయింది.రాహుల్ రామకృష్ణ కు ఆద్యాంతం ఉండే మంచి క్యారెక్టర్ లభించింది కానీ అతని కొన్నిసార్లు నవ్వించినా..ఎక్కువ విసగించాడు.అదాశర్మ కు ఇంపార్టెన్స్ ఏం లేదు.ఎప్పుడూ సీరియస్ గానే కనిపిస్తుంది.నందితా శ్వేత కు మంచి రోల్ దక్కింది.ఆమె తన పాత్రకు న్యాయం చేసింది.అశుతోష్ రానా,శత్రు,తమ పాత్రల్లో రాణించారు.సిద్దూ జొన్నలగడ్డ మంచి నటనతో మెప్పించాడు.

టెక్నికల్ వర్క్:

టెక్నికల్ స్టాండర్డ్స్ బాగున్నాయి.సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.శ్రావణ్ భరద్వాజ్ పాటల్లో ఏది వినసొంపుగా లేదు..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా లౌడ్ గా ఉంది.కొన్ని సార్లు ఇరిటేట్ చేసింది.ఆర్ట్ వర్క్ బాగుంది.యాక్షన్ సీన్లను స్టైలిష్ గా డిజైన్ చేశారు.ఎడిటింగ్ లో లోపాలున్నాయి.చాలా సీన్లు డ్రాగ్ అయినట్టు అనిపిస్తుంది.ముఖ్యంగా ఫస్టాఫ్ లో.. ప్రశాంత్ రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘కల్కి’’ ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా.. కొన్ని ఇంట్రస్టింగ్ పాయింట్స్ ఉన్నా కానీ..నరేషన్ సరిగా లేకపోవడంతో మిస్ ఫైర్ అయింది..అసలైన కథ చివరి 20 నిమిషాల్లో పెట్టుకుని మొదట్నుంచి అనవసరంగా డ్రాగ్ చేసుకుంటు వచ్చి విసిగించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.సినిమా స్లో గా మొదలవుతుంది..ఇన్వెస్టిగేషన్ పేరు చెప్పి రాహుల్ రామకృష్ణ చేసే కామెడీ ఇరిటేట్ చేస్తుంది..డైరెక్టర్ ప్రేక్షకులను నవ్వించడానికి,థ్రిల్ చేయడానికి,భయ పెట్టడానికి చాలా కష్టపడ్డాడు..అవన్నీ ప్రయత్నాలు విఫలమయ్యాయి.. ఆ శేఖర్ బాబు చనిపోయాడని తన గురించి ఇన్వెస్ట్ చేయకుండా..కల్కి హీరోయిజం చూపించడానికి ఎక్కువ టైమ్ తీసుకున్నారు. హీరో ఎలివేషన్ కు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే మరీ విసిగిస్తుంది. తద్వారా ఒక్కోసారి ఈ కథ ఎటు వెళ్తుందో అనిపిస్తుంది.ఇక సెకండాఫ్ లో కొన్ని ట్విస్టులు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి.క్లైమాక్స్ లో రివీల్ చేసిన పాయింట్ బాగుంది. కానీ అప్పటి దాకా జరిగిన డామేజ్ వల్ల అదేమంత ఎక్సయిట్ చేయదు. ఓవరాల్ గా ‘‘కల్కి’’ కేవలం అక్కడక్కడ తప్ప పెద్దగా మెప్పించదు.