పర్వతగిరి, వెలుగు : అథ్లెటిక్స్ స్టేట్ లెవల్ పోటీలకు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ స్కూల్‌కు చెందిన స్టూడెంట్లు ఎంపికయ్యారు. హనుమకొండ జేఎన్‌ఎస్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో స్కూల్‌కు చెందిన సంజుభార్గవ్, జి.హర్షిణి, ఎం. పౌర్ణమి ప్రతిభ చూపి స్టేట్ లెవల్‌కు ఎంపికయ్యారు. వీరు శనివారం కొత్తగూడెంలో జరిగే స్టేట్ లెవల్ పోటీలకు హాజరుకానున్నారు. ఎంపికైన స్టూడెంట్లను కరస్పాండెంట్ అశోకాచారి, హెచ్‌ఎం శ్రీనివాస్, టీచర్లు అభినందించారు.