మక్తల్, వెలుగు: నారాయణపేట జిల్లా రైతులకు సాగు నీటిని అందించే జీవో 69ను అమలు చేసిన తర్వాతే మంత్రులు జిల్లాలో కాలు పెట్టాలని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ నర్సింహ, బీజేపీ జిల్లా నాయకుడు కల్లూరి నాగప్ప, మండల అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం చేపట్టి సాగు నీటిని ఇచ్చిన తరువాతే సీఎం కేసీఆర్, మంత్రులు జిల్లాలో అడుగు పెట్టాలన్నారు.
జిల్లా పర్యటనకు వస్తున్న మంత్రి హరీశ్‌రావు ఈ విషయంపై జిల్లా రైతులకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతాప్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఆశప్ప, చంద్రప్ప, లక్ష్మణ్, నర్సింహులు, తిరుమలేశ్, ఆనంద్ పాల్గొన్నారు.