నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ పోలీస్‌కమిషనర్‌గా (సీపీ) కల్మేశ్వర్ శింగేన్వార్ను ఎన్నికల కమిషన్ నియమించింది. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన హైదరాబాద్సీసీఎస్లో డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్ వేళ జిల్లాలో సీపీగా పనిచేయడానికి ముగ్గురు ఆఫీసర్ల పేర్లు తెప్పించుకున్న కమిషన్ కల్మేశ్వర్‌ను ఎంపిక చేసింది.
తక్షణం బాధ్యతలు స్వీకరించాలని ఆయన్ను ఆదేశించింది. నిజాయతీ అధికారిగా కల్మేశ్వర్‌కు పోలీస్‌శాఖలో పేరుంది. కమిషనర్సత్యనారాయణను ఈసీ రెండు రోజుల కింద ఇక్కడి నుంచి తప్పించిన విషయం తెలిసిందే.