కాళోజీ హెల్త్ వర్సిటీ డెంటల్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ జిల్లా: డెంటల్ పీజీ కోర్సులో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మొదటి విడత నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండిఎస్ మొదటి విడత అడ్మిషన్లకు ఈ నెల 4, 5న  వెబ్  ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది.

అర్హులైన జాబితా యూనివర్సిటీ వెబ్ సైట్ లో ఉంచారు. కాలేజీల వారీగా సీట్ల వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు కాలేజీల వారీగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. 

పూర్తి వివరాలను వర్సిటీ వెబ్ సైట్: www.knrush.telangana.in లో చూడొచ్చు.