వరంగల్‌సిటీ, వెలుగు: పలు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు భర్తీ చేసేందుకు ప్రకటన జారీ చేసింది. నాలుగేండ్ల డిగ్రీ కోర్సు బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్ , రెండు సంవత్సరాల డిగ్రీ కోర్సు పోస్ట్ బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపికోర్సుల్లో ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రవేశాలు కల్పించనున్నారు.
శుక్రవారం నుంచి అక్టోబర్3వ తేది సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ధ్రువ పత్రాలు పరిశీలించి తుది మెరిట్ జాబితాను యూనివర్సిటీ ప్రకటిస్తుంది. అప్లికేషన్- ప్రక్రియలో సాంకేతిక సమస్యలుంటే 93926 85856, 78425 42216, 90596 72216 నంబర్లను.. నిబంధనలు తెలుసుకోవాలంటే 94905 85796, 85006 46769 నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు. వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ చూడాలన్నారు. కాగా, 2017~-2021 బ్యాచ్-లకు జారీచేసిన ప్రొవిజనల్స్-ల్లో ఇంటి పేరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కొందరు విద్యార్థులు కాళోజీ హెల్త్ వర్సిటీ రిజిస్ర్టర్ ప్రవీణ్‌కుమార్-కు వినతి పత్రం అందజేశారు.