పీజీ మెడికల్, డెంటల్‌ సీట్లకు కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్‌

 వరంగల్​సిటీ, వెలుగు : రాష్ట్రంలోని పీజీ వైద్యవిద్య  కోర్సుల్లో యాజమాన్య కోటాలో  ప్రవేశాలకు ఆన్ లైన్ లో అప్లికేషన్లు పెట్టుకునేందుకు కాళోజీ నారాయణరావు హెల్త్  యూనివర్సిటీ మంగళవారం నోటిఫికేషన్  విడుదల చేసింది.  జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ - పీజీ, ఎండీఎస్‌  2023లో అర్హత సాధించిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చని వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. 


ఈ ఆన్ లైన్  అప్లికేషన్లను ఈ నెల 9వ తేదీ  ఉదయం 8 గంటల నుంచి 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నారు. అప్లికేషన్  పూర్తిచేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్  చేసి వెబ్ సైట్ లో అప్ లోడ్  చేయాలి. దరఖాస్తులు, సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం తుది మెరిట్  జాబితాను  విడుదల చేస్తారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత, ఇతర  సమాచారం కోసం వర్సిటీ వెబ్ సైట్  www.knruhs.telangana.gov.in ను చూడవచ్చని అధికారులు సూచించారు.