కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాఢవీధులు పూర్తి చేయాలే

  •     వరంగల్‍ పశ్చిమ అభివృద్ధిపై హైదరాబాద్‍లో మంత్రుల రివ్యూ

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ పశ్చిమ నియోజకవర్గంలోని కాళోజీ కళాక్షేత్రం, భద్రకాళి మాఢవీధుల పనులను వేగవంతం చేయాలని ఉమ్మడి వరంగల్‍ ఇన్​చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‍రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం నియోజకవర్గ అభివృద్ధిపై జిల్లాకు చెందిన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డితో కలిసి హైదరాబాద్​లోని సెక్రటేరియట్‍లో రివ్యూ నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. కళాక్షేత్రంతో పాటు మాఢవీధుల నిర్మాణాలకు అడిషనల్​ నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‍ తర్వాత అంతే పెద్దదైన గ్రేటర్‍ వరంగల్​లో అభివృద్ధి పనులకు ఎటువంటి ఆటంకం రాకుండా చూడాలన్నారు. స్మార్ట్‍ సిటీ ఫండ్స్​ను త్వరగా రిలీజ్‍ చేసి పనులను స్పీడప్‍ చేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్‍ సెక్రటరీ దానం కిశక్షర్‍, ఈఎన్‍సీ అధికారి శ్రీధర్‍, వివిధ శాఖల ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.