3వ రోజుకు చేరిన లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ

3వ రోజుకు చేరిన లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ

నిజామాబాద్: నందిపేట మండలం సిహెచ్ కొండూరులో శ్రీ రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నర్సింహా స్వామి ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు మూడో రోజుకు చేరుకున్నాయి. లోక కళ్యాణం, విశ్వశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులతోపాటు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 
ఇవాళ ఉదయం ప్రాతరారాధన, సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోర్తె, ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర మూర్తి, మంత్ర హవనము, మృత్తికాస్నపనం, నయనోన్మీలనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత హవనము, నిత్య పూర్ణాహుతి, నివేదన, మంగళాశాసనములు, వేద విన్నపాలు, శాత్తుమోరై, తీర్థ ప్రసాదగోష్ఠి తదితర కార్యక్రమాలు జరిగాయి. 
సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, ద్వార తోరణ ధ్వజ కుంభారాధన, చతుఃస్థానార్చన, అగ్నిముఖం, మూలమంత్ర మూర్తి మంత్ర హవనములు, ప్రతిష్ఠా విగ్రహాలకి క్షీరాధివాసము తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. 

 

ఇవి కూడా చదవండి

ఇవాళ, రేపు ఏపీలో జేపీ నడ్డా పర్యటన

మంత్రులను నిలదీసిన ఆర్యవైశ్య నేతలు

జూన్ 2న యాడ్స్ కోసం పెట్టిన ఖర్చెంత?