అభివృద్ధిని చూసి ఓటేయండి : కె.సంజయ్

మెట్‌‌‌‌పల్లి, వెలుగు: ఎలక్షన్లలో గెలిచేందుకు ప్రతిపక్ష పార్టీల లీడర్లు  కల్లిబొల్లి మాటలు చెబుతారని, తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్​హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని కోరుట్ల బీఆర్ఎస్​అభ్యర్థి డాక్టర్​కల్వకుంట్ల సంజయ్​ కోరారు. సోమవారం మెట్‌‌‌‌పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ ​మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌ అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.  

కాంగ్రెస్ పాలనలో  రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారన్నారు. వ్యవసాయం దండుగా తెలంగాణలో కేసీఆర్ పండుగ చేసి చూపించారన్నారు. కోండ్రికర్ల పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణానికి ఫండ్స్ ఇప్పటికే శాంక్షన్​అయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతున్నాయన్నారు. ప్రచారంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, రాజారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.