బీఆర్ఎస్ ఓటమికి ఫేక్ ​న్యూసే కారణం : కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి/ కోరుట్ల, వెలుగు: బీఆర్ఎస్​ ఓటమికి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం చేసిన ఫేక్ న్యూస్ లే కారణమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు.  బుధవారం మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో నిర్వహించిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని సర్పంచులు విజయవంతంగా ఐదేండ్లు పదవీ బాధ్యతలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. బీఆర్ఎస్​ లీడర్లు, అధికారులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు.

కార్యకర్తలు, నాయకులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.  మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ సర్పంచులకు గౌరవ వేతనం ఇచ్చింది ఒక్క కేసీఆరే నన్నారు. అంతకుముందు మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, కోరుట్ల బల్దియా ఆఫీసుల్లో  కౌన్సిల్​జనరల్​బాడీ మీటింగులు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లిలో ఎజెండాలో పొందుపర్చిన 9 అంశాలు, కోరుట్లలో 3 అంశాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కోరుట్లలో ఫైర్​స్టేషన్​ ఏర్పాటు చేయాలని చేసిన తీర్మానాన్ని సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్లు ​సుజాత, లావణ్య, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.