ప్రభుత్వ కాలేజీలో సమస్యలు పరిష్కరిస్తా : కల్వకుంట్ల సంజయ్

మెట్‌‌‌‌పల్లి, వెలుగు: మెట్‌‌‌‌పల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ హామీ ఇచ్చారు. గురువారం కాలేజీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నీటి సమస్య, సిబ్బంది కొరత ఉందని ప్రిన్సిపాల్  ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  సంజయ్​ జిల్లా నోడల్ ఆఫీసర్ తో మాట్లాడి వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని కోరారు. 

కోరుట్ల, వెలుగు: ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి గుడ్ మార్నింగ్ కోరుట్ల నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. గురువారం కోరుట్లలోని 30వ వార్డులో పర్యటించారు.