ఫార్మాసిటీ  రద్దు నిర్ణయం దారుణం : కల్వకుంట్ల సంజయ్

మెట్ పల్లి, వెలుగు:  హైదరాబాద్‌‌లో చేపట్ట దలిచిన ఫార్మాసిటీ రద్దు నిర్ణయం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. శుక్రవారం ‘X’(ట్విట్టర్‌‌‌‌)లో ఆయన స్పందించారు. హైదరాబాద్​అభివృద్ధితో పాటు ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ సర్కార్​ పొల్యూషన్‌‌ ఫ్రీ ఫార్మాసిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని, అందుకు రైతులు సైతం ఒప్పుకుని తమ భూములు ఇచ్చారన్నారు.

ఈ ఫార్మాసిటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చేవన్నారు. ఈ ప్రాజెక్టు కేసీఆర్ మానసపుత్రికని అభివర్ణించారు.