కేసీఆర్​ నాయకత్వంలోనే  అభివృద్ధి; కల్వకుంట్ల విద్యాసాగర్​రావు

కోరుట్ల, వెలుగు : సీఎం కేసీఆర్​ నాయకత్వంలోనే  రాష్ట్రంతోపాటు కోరుట్ల నియోజకవర్గం అభివృద్ధిలో నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలిచాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు, అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్​ అన్నారు. బుధవారం కోరుట్లలో కుటుంబసభ్యులు, శ్రేణులతో కలిసి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నామినేషన్ వేశారు. అనంతరం కల్వకుంట్ల సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గంలో ఎన్నో పనులు పూర్తిచేశామని, తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.

అందరికీ అందుబాటులో ఉండే తనను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని సంజయ్​కోరారు. ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం నెరవేర్చానని, దాదాపు అన్ని పనులు పూర్తి చేశామన్నారు. విద్యాసాగర్​రావు కూడా నామినేషన్​ దాఖలు చేశారు.