వెల్జాల్ గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తా : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

వెల్జాల్ గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తా : ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

ఆమనగల్లు, వెలుగు: తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.  మంగళవారం ప్రజాపాలన గ్రామసభలో పాల్గొన్న ఆయనను గ్రామస్తులు గ్రామాన్ని మండల కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. 

 ఐదు గ్రామసభల తీర్మానాలు తీసుకువస్తే మండలం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.  గ్రామంలో పీఎసీఎస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.  గ్రామంలోని సహదేవ సముద్రాన్ని కృష్ణాజలాలతో నింపుతామని తెలిపారు. మార్కెట్ చైర్మన్ గీతా నరసింహ, వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ కేశవరెడ్డి, వైస్ చైర్మన్ రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.