కల్వకుర్తి మార్కెట్ ‌‌ ‌‌ కమిటీ నియామకంపై వీడని పీటముడి

కల్వకుర్తి మార్కెట్ ‌‌ ‌‌ కమిటీ నియామకంపై వీడని పీటముడి
  • తమ వారికే చైర్మన్ ‌‌ ‌‌ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు
  • కల్వకుర్తికి చెందిన విజయ్ ‌‌ ‌‌గౌడ్ ‌‌ ‌‌కు మాటిచ్చిన జైపాల్
  • వంగూరుకు చెందిన రాజేందర్ ‌‌ రెడ్డి ఇవ్వాలని పట్టుబడుతున్న గువ్వల 


నాగర్ ‌‌కర్నూల్, వెలుగు:కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం నియామకంపై పీటముడి వీడడం లేదు.  2022  మార్చి 16నే  పాత కమిటీ దిగిపోయినా.. కొత్త కమిటీని ఎన్నుకోవడం లేదు.  చైర్మన్ ‌‌ ‌‌గా తాము చెప్పిన వారే ఉండాలని  కల్వకుర్తి, అచ్చంపేట ఎమ్మెల్యేలు పట్టుబడుతుండటం సమస్యగా మారింది. పాత కమిటీలో వైస్ చైర్మన్ ‌‌ ‌‌గా ఉన్న విజయ్ గౌడ్ ‌‌ ‌‌కు చైర్మన్ ‌‌ ‌‌గా అవకాశం ఇస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాటిచ్చారు. వంగూరు మండలానికి చెందిన రాజేందర్ రెడ్డిని చైర్మన్ చేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పట్టుబడుతున్నారు. వీళ్ల పొత్తుల పంచాయితీ ఎంతకూ తెగకపోవడంతో కొత్త కమిటీపై క్లారిటీ రావడం లేదు.  దీంతో మార్కెట్ ‌‌ ‌‌లో లావాదేవీలు, క్రయవిక్రయాలు గాడితప్పాయి. 

మూడు నియోజకవర్గాలు..

కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోకి కల్వకుర్తి, వెల్దండతో పాటు జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలం, అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, చారకొండ మండలాలు వస్తాయి.  కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ మండలాలకు చెందిన 78  గ్రామాలు.  వంగూరు, చారకొండ మండలాలకు సంబంధించిన 37 గ్రామాలు మార్కెట్ పరిధిలో ఉంటాయి.  గతంలో  కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉన్నపుడు కల్వకుర్తి నియోజకవర్గానికి చైర్మన్ పదవి, అచ్చంపేట నియోజకవర్గానికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.  ఈసారి అచ్చంపేట నియోజకవర్గానికి  మార్కెట్ చైర్మన్ పదవి ఇప్పించేందుకు ఎమ్మెల్యే గువ్వల ప్రయత్నిస్తుండడంపై  స్థానిక కార్యకర్తలు, లీడర్లు మండిపడుతున్నారు. 

మొదటి సారే కిరికిరి

2019 మార్చి17న కొత్త కమిటీ ఏర్పాటు సమయంలోనే చైర్మన్ పదవి అచ్చంపేట నియోజకవర్గానికి ఇవ్వాలని ఎమ్మెల్యే గువ్వల పట్టుబట్టారు.  దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చాంబర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌లో కల్వకుర్తి, వంగూరు మండల లీడర్ల మధ్య చిన్నపాటి యుద్దమే జరిగింది. చైర్మన్ ‌‌ ‌‌గా కల్వకుర్తికి చెందిన బాలయ్య, వైస్ చైర్మన్ ‌‌ ‌‌గా సింగం విజయ్ గౌడ్ పేర్లు ప్రతిపాదించడాన్ని గువ్వల తీవ్రంగా వ్యతిరేకించారు.  ఆనవాయితీని కాదని రెండు పదవులు కల్వకుర్తికే ఇస్తే తమ వారికి ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు.  మంత్రి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉండగా.. పాలకవర్గం గడువు 2021 సెప్టెంబర్ ‌‌ ‌‌ ‌‌ ‌‌లో ముగియాల్సి ఉన్నా కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ‌‌ ‌‌ 2022 మార్చి వరకు కొనసాగేలా ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఇప్పించారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఎక్స్ ‌‌ ‌‌టెన్షన్ ‌‌ ‌‌ ఇవ్వడంపైనా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల  అప్పట్లో ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఆగని ఆశావహులు ప్రయత్నాలు

ఈసారి చైర్మన్ ‌‌ ‌‌గా విజయ్ గౌడ్ ‌‌ ‌‌కు అవకాశం ఇస్తామని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ప్రకటించినా ఆశావహులు తమ ప్రయత్నాలు ఆపడం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన వంగూరు మండలానికి చెందిన రాజేందర్ రెడ్డికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చిన గువ్వల బాలరాజు హైకమాండ్ వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు.  అలాగే జడ్చర్ల నియోజకవర్గంలోని ఊర్కొండ మండలానికి చెందిన లీడర్ల కూడా తమకు వైస్ ‌‌ ‌‌ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు.  కాగా,  చారకొండలో సబ్ ‌‌ ‌‌యార్డు ప్రతిపాదన ఉండడంతో అచ్చంపేట లీడర్లకు అక్కడ ప్రాతినిథ్యం కల్పించాలని  కల్వకుర్తి నేతలు సూచించారు. 

నిధులున్నా అభివృద్ధి సున్నా.. 

కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ ‌‌ ‌‌లో పుష్కలంగా నిధులున్నా, ముగ్గురు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉన్నా..  డెవలప్ ‌‌ ‌‌మెంట్ ‌‌ ‌‌ పనులు మాత్రం జరగడం లేదు.  గతంలో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ స్లాబ్ బీటలు వారి గోడల నుంచి వర్షపు నీరు లోపలికి చేరుతోంది. దీంతో  ధాన్యం, సంచులు తడిసిపోయి నష్టం వాటిల్లుతోందని ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్లు మొత్తుకుంటున్నారు.  కరోనా లాక్ ‌‌ ‌‌డౌన్ ‌‌ ‌‌టైంలో ఉదయం 4 గంటలకు మార్చిన కూరగాయల మార్కెట్ టైమింగ్ ‌‌ ‌‌ను కరోనా పోయినా అలాగే కొనసాగిస్తున్నారు. దీంతో  రైతులు అర్ధరాత్రి మార్కెట్ ‌‌ ‌‌కు వచ్చి అవస్థలు పడుతున్నారు. కనీసం మార్కెట్లో జరుగుతున్న క్రయ, విక్రయాలకు కూడా జవాబుదారీ ఉండడం లేదు.  వెంటనే మార్కెట్ కమిటీకి కొత్త పాలకవర్గాన్ని నియమించి.. సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.