
ఆమనగల్లు, వెలుగు: మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలోని ఎంబీ చర్చి డెవలప్మెంట్కు తనవంతు సహకారం అందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. ఎంబీ చర్చి ఏర్పాటు చేసి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చర్చి నిర్వాహకులు ఎమ్మెల్యేను సన్మానించారు. జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీసింగ్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.