ArjunSonOfVyjayanthi: కళ్యాణ్ రామ్ మూవీ వీకెండ్ కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

ArjunSonOfVyjayanthi: కళ్యాణ్ రామ్ మూవీ వీకెండ్ కలెక్షన్లు.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

కళ్యాణ్ రామ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను బాగానే ఎంగేజ్ చేస్తోంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్టుకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు రెండో రోజు వసూళ్ల కంటే మూడో రోజు వసూళ్లు ఎక్కువ వచ్చాయి.

గుడ్ ఫ్రైడే రోజున (ఏప్రిల్ 18న) విడుదలైన అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాకు మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.12.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా వెల్లడించింది. ఈ మూవీ రిలీజైన మూడ్రోజుల్లో రూ.7.45 కోట్ల షేర్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. 

తొలి రోజు రూ.5.15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు మేకర్స్ అనౌన్స్ చేయగా, రెండో రోజు శనివారం రూ.8.55 కోట్లు వచ్చినట్లు తెలిపారు. ఇకపోతే, షేర్ వసూళ్లు చూసుకుంటే.. మొదటిరోజు [1వ శుక్రవారం] రూ.3.4 కోట్లు, 2వ రోజు [శనివారం] రూ.1.95 కోట్లు, 3వ రోజు [ఆదివారం] రూ.2.1 కోట్లు షేర్ రాబట్టింది. మూడో రోజైన ఆదివారం కలెక్షన్లలో జోరు చూపించింది. 

3వ రోజు మార్నింగ్ షోలకు 15.56 శాతం, మధ్యాహ్నం షోస్ రూ.25.74 శాతం, సాయంత్రం, నైట్ షోస్ కు 30 శాతం మేర ఆక్యుపెన్సీ నమోదైనట్టు తెలుస్తోంది. దీంతో సాయంత్రం వరకు ఈ మూవీ రూ.1.35 కోట్ల ఇండియా నెట్ వసూళ్లు చేసింది. 

సుమారుగా రూ.45 కోట్ల బడ్జెట్ తోఈ మూవీ తెరకెక్కినట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ థియేట్రికల్ హక్కులు సుమారుగా రూ.18 కోట్లకు అమ్ముడయ్యాయి. కర్ణాటక, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ హక్కులు సుమారుగా రూ.4 కోట్ల మేరకు రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 25 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.