గెట్ రెడీ : మాస్ పాటకు ముహూర్తం పెట్టిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మేకర్స్

గెట్ రెడీ : మాస్ పాటకు ముహూర్తం పెట్టిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ మేకర్స్

కళ్యాణ్ రామ్ హీరోగా  ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.  విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు.  అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై  అశోక్ వర్ధన్ ముప్పా,  సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మొదటి పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. ‘నాయాల్ది’ అంటూసాగే ఫస్ట్ సాంగ్‌‌ను ఈనెల 31న రిలీజ్ చేయనున్నట్టు శుక్రవారం  ప్రకటించారు.  

ఈ  సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌‌‌‌లో కళ్యాణ్ రామ్ క్లాస్‌‌ లుక్‌‌లో  స్టైలిష్‌‌ డ్యాన్స్ మూమెంట్‌‌ చేస్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. జాతర బ్యాక్‌‌డ్రాప్‌‌లో పండగ వైబ్‌‌ను ఇందులో చూపిస్తున్నారు. అజనీష్ లోక్‌‌నాథ్ కంపోజ్ చేసిన  ఈ మాస్ నంబర్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తుందని మేకర్స్ చెప్పారు.  సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేయనున్నారు.