తికమక పెడుతున్న కళ్యాణ్ రాం డెవిల్.. : రోజుకో పేరుతో ఫ్యాన్స్ అయోమయం

తికమక పెడుతున్న కళ్యాణ్ రాం డెవిల్.. : రోజుకో పేరుతో ఫ్యాన్స్ అయోమయం

నందమూరి కళ్యాణ్ రామ్(NandamuriKalyanRam) కొత్త మూవీ డెవిల్. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న డెవిల్ నుంచి రిలీజ్ అయినా ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్స్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి హీరోయిన్ సంయుక్త మీనన్(Samyukthamenon) బర్త్ డే స్పెషల్ గా ఫస్ట్‌‌‌‌ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను  ఆకట్టుకున్నప్పటికీ..అందులో ఒక క్వశ్చన్ మార్క్ ను క్రియేట్ చేసింది. అదేంటో చూద్దాం. 

ఫస్ట్ డెవిల్ మూవీ మేకర్స్ విషయానికి వస్తే..ఈ మూవీకి స్టోరీ, డైలాగ్స్, రైటర్ శ్రీకాంత్ విస్సా(Srikanth Vissa), స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నవీన్ మేడారం(NaveenMedaram) వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణ భాద్యతలను అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ చూసుకుంటున్నారు. ఇది వరకి అంతా బానే ఉంది. ఇక డెవిల్ నుంచి ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్న క్రమంలో..పోస్టర్స్పై మేకర్స్ పేర్లు మారుతున్నాయి. దీంతో ఆడియన్స్ గందరగోళంలో పడుతున్నారు. అసలు ఎవరు..ఏ క్యాటగిరికి వర్క్ చేస్తున్నారో..చెప్పండి అంటూ సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అవుతున్నారు.    

డెవిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు కూడా పోస్టర్ పై డైరెక్టర్ గా నవీన్ మేడారం పేరు రాసి ఉంది. దర్శకత్వ పర్యవేక్షణగా అభిషేక్ పిక్చర్స్ అని ఉంది.ఆ తర్వాత క్రమక్రమంగా స్క్రీన్ ప్లే, డైరెక్టర్ గా నవీన్ మేడారం పేరు పడింది. ఆ తర్వాత మళ్లీ కొద్ది రోజులకు స్క్రీన్ ప్లే మాయమై..జస్ట్ డైరెక్టర్ గా మాత్రమే ఉంది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో డైరెక్టర్ టైటిల్ కార్డు కూడా పోయి..నవీన్ మేడారం ప్రస్తావనే లేదు. దీంతో డైరెక్టర్ నవీన్ పేరు తీసేసినట్లుగా తెలుస్తోంది. ఇక డైరెక్టర్గా అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా(Abhisheknama) డైరెక్టర్ గా పేరు పడింది. 

దీంతో వీరిద్దరి మధ్య గొడవలు ముదిరినట్లు తెలుస్తోంది. కనుకే మూవీ ఔట్ ఫుట్ విషయంలో కూడా లేట్ అవుతూ వస్తోంది. ఏది ఏమైనా డైరెక్టర్ తనంతట తానే వచ్చాడా? లేక ప్రొడ్యూసర్ పంపించేసేడా వంటి విషయాలు వెల్లడించలేదు.త్వరలో మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.