Devil Movie Review: దేశభక్తితో కూడిన సస్పెన్స్ స్పై థ్రిల్లర్

Devil Movie Review:  దేశభక్తితో కూడిన సస్పెన్స్ స్పై థ్రిల్లర్

కళ్యాణ్ రామ్ హీరోగా అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందించిన స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. పీరియాడికల్ డ్రామా..బ్రిటీష్‌‌ వాళ్లు ఇండియాను ప‌‌రిపాలించిన కాలానికి సంబంధించిన క‌‌థ‌‌తో ఇవాళ (డిసెంబర్ 29న) థియేటర్లో రిలీజ్ అయింది.

బ్రిటిష్ కాలం నాటి కల్పిత కథతో సినిమా వస్తుండటంతో..నాటి ప‌‌రిస్థితుల‌‌ను ఆవిష్కరించేలా భారీగా సినిమాను చిత్రీక‌‌రించారు మేకర్స్. టీజర్, ట్రైలర్ తోనే డెవిల్‌ మూవీ ప్రేక్ష‌కుల్ని ఎంతోగాను ఆక‌ర్షించింది. మ‌రి ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ కథ ఎలా ఉందో..కళ్యాణ్ రామ్ మరో హిట్ కొట్టాడా? లేదో?చూద్దాం. 

కథేంటి?

ఈ సినిమాలో బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌‌గా డెవిల్ (కళ్యాణ్ రామ్) పాత్రలో కనిపించాడు.ఈ సినిమా కథంతా 1945లో సాగుతుంది. స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ చీఫ్‌ సుభాష్‌ చంద్రబోస్‌ను పట్టుకోవడానికి బ్రిటిష్ ప్రభుత్వం ప్లాన్ వేస్తుంది. అదే క్రమంలో బోస్ ఇండియాకు వస్తున్నట్లు తన అనుచరులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అలాగే ఎక్కడ దిగాలనేది ఓ కోడ్‌ రూపంలో తెలియజేయాలని..తన ముఖ్య అనుచరుడైన త్రివర్ణకు లేఖ ద్వారా తెలియజేస్తారు.అదే సమయంలో మద్రాసు ప్రెసిడెన్సీలోని రాస‌పాడు జ‌మీందారు కుమార్తె విజ‌య (అభిరామి) మర్డర్ అవుతుంది. ఈ కేసు ఇన్వెస్ట్గేషన్ బాధ్యతలను డెవిల్కి అప్పగిస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్.

ఈ కేసు విచారణలో భాగంగా..ఆ ఊరికి వెళ్లి హత్యకేసు డీల్ చేయడం మొదలుపెడతాడు. అక్కడ డెవిల్కి విజయ కజిన్‌ నైషేద (సంయుక్త మీనన్‌)పై అనుమానం కలుగుతుంది. ఆ తర్వాత వెంట వెంటనే ఊర్లో మర్డర్స్ జరగడం..సీక్రెట్గా నైషేదని ఎవరో కలవడం..ఇవన్నీ అనుమానాలు డెవిల్ దృష్టిలో మెదులుతాయి. దీంతో ఆమెతో ప్రేమలో పడినట్లు నటించి..అసలు విషయం తెలుసుకోవాలని డెవిల్ ప్రయత్నిస్తాడు.

మరి డెవిల్ నిజంగానే మర్డర్ కేసుని చేధించడానికి ఆ ఊరికి వెళ్లాడా? లేక నేతాజీ రైట్ హ్యాండ్ త్రివర్ణని పట్టుకోవడానికి వెళ్లాడా? చివరికి బ్రిటిష్ ఆర్మీ సుభాష్ చంద్రబోస్ ఆచూకీ కనుక్కున్నారా?  ఈ కథలో చంద్ర‌బోస్ టీమ్‌లోని మ‌ణిమేఖ‌ల (మాళ‌వికా నాయ‌ర్‌) క్యారెక్టర్ ఏంటీ?  అనేది తెలియాలంటే డెవిల్ సినిమాను చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 

ఎక్కువగా ప్రయోగాలు చేయడానికి కల్యాణ్ రామ్ ఎప్పుడు ఇష్టపడుతుంటారు. అలాంటి ప్రయోగమే ఈ డెవిల్. బ్రిటీష్ కాలం నాటి కథతో రూపొందించడంతో పాటు..దేశ‌భ‌క్తి..థ్రిల్లింగ్ అంశాలు ఉండటం ప్రత్యేకత అని చెప్పుకోవాలి. రీసెంట్గా వచ్చిన స్పై థ్రిల్ల‌ర్ సినిమాల‌తో పోలిస్తే..డెవిల్ పీరియాడిక్ నేప‌థ్యంలో సాగడ‌మే ఆసక్తికరంగా మారింది. దానిని చేధించేందుకు కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్గా హీరో ఎంట్రీ ఇవ్వడం..ఆ తర్వాత ఓ హత్య జరగడం..ఇక హత్య ఇన్వెస్టిగేషన్ లో ఉండగానే..ఎన్నో ఊహించని విషయాలు తెలుసుకోవడం వంటి అంశాలు ఆసక్తిగా ఉంటాయి.

ఇటువంటి స్పై థ్రిల్ల‌ర్ మూవీస్ తెరకెక్కించేటపుడు చూపించాల్సిన స్క్రీన్ ప్లే కాస్తా తొందరపాటుగా అనిపిస్తోంది. అలాంటి సమయంలోనే హీరో..హీరోయిన్ మధ్య ప్రేమ కహానీ..మధ్యలో పాటలు రావడంతో ఫస్టాఫ్ నెమ్మదిగా సాగుతున్న ఫీలింగ్ ఇస్తోంది. ఇలాంటి క్రమంలోనే, ఇంటర్వెల్‌ ముందు వచ్చే యాక్షన్‌ సీన్స్ బాగుటుంది. అసలు కథ అప్పుడే మొదలవుతుంది. అక్కడ వచ్చే ట్విస్ట్‌ సినిమా సెకండాఫ్ పై మరింత ఇంట్రెస్ట్ కలిగించేలా చేస్తోంది.

సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు..త్రివ‌ర్ణ ఎవ‌రనే విష‌యం కనిపెట్టడం..అంతలోనే ఐఎన్‌ఏలో బ్రిటిష్ సైన్యం కోసం ప‌నిచేసే కోవ‌ర్ట్‌ని ప‌సిగ‌ట్ట‌డం..సుభాష్ చంద్ర‌బోస్ రాక‌ను డీకోడ్ చేయ‌డానికి చేప‌ట్టిన ఆప‌రేష‌న్ టైగ‌ర్ హంట్..ట్విస్ట్‌తో క‌థ ఆస‌క్తిక‌రంగా మారుతుంది. సినిమాలో చాలా సీన్స్లో  వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులని కట్టిపడేస్తాయి. ఈ కథ క్లైమాక్స్ విషయంలో కళ్యాణ్ రామ్ పోరాట సన్నివేశాలు ఇంకాస్తా బాగా తెరకెక్కించి ఉంటే డెవిల్ క్లైమాక్స్ గురుంచి ప్రత్యేకంగా మాట్లాడుకునేవాళ్ళం. 

ఎవ‌రెలా చేశారంటే:

కల్యాణ్‌ రామ్‌ డెవిల్ క్యారెక్టర్ చాలా ఉన్నతంగా ఉంది. వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోవడమే కాదు..ఆ పాత్రల్లో ఎలా జీవిస్తాడు అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న డెవిల్‌ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు కళ్యాణ్ రామ్. యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశాడు. బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు..అప్పుడు వాడే ఆయుధాలు చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. సంయుక్త, మాళ‌విక నాయ‌ర్ మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటించి మెప్పించారు. డెవిల్ పక్కన అసిస్టెంట్గా చేసిన సత్య, వసిష్ఠ సింహ, షఫీ, మహేష్ లతో పాటు పలువురు బ్రిటిష్ యాక్టర్స్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విషయాలకొస్తే..

డైరెక్టర్ సినిమా తెరకెక్కించిన విధానం బాగుంది. కొన్ని చోట్ల ఇంకాస్త బాగా తెరక్కించి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండేది. సౌంద‌ర్‌రాజ‌న్ త‌న కెమెరాతో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. పీరియాడిక్ నేప‌థ్యాన్ని కళ్లకు కట్టినట్లు ఆవిష్క‌రించిన తీరు బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్ అని చెప్పుకోవాలి. డైలాగ్ అండ్ స్టోరీ రైటర్ శ్రీకాంత్ విస్సా పెన్ను పవర్ చాలా బాగుంది. ఎమోషన్స్ సీన్స్ లో వచ్చే డైలాగ్స్ మరింత ఆకట్టుకుంటాయి.