
కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్నాడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. శనివారం మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీకి ఇంపాక్ట్‌ఫుల్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ అనే టైటిల్‌ను రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్, విజయశాంతి పాత్రలని ఇంటెన్స్‌గా ప్రజెంట్ చేస్తున్న ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
మండుతున్న అగ్ని జ్వాలల మధ్య దృఢ సంకల్పంతో నడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. మధ్యలో సంకెళ్లను చూపించడం క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. కళ్యాణ్ రామ్ సీరియస్ లుక్‌లో ఉండగా, విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్‌గా పోలీస్ యూనిఫామ్‌తో అంతే ఇంటెన్సిటీతో కనిపిస్తున్నారు. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సోహైల్ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయిందని, త్వరలోనే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెప్పారు.