ArjunSonOfVyjayanthi X Review: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ X రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే ?

ArjunSonOfVyjayanthi X Review: కళ్యాణ్ రామ్ ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ X రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే ?

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన యాక్షన్ ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ (Arjun S/O Vyjayanthi). కళ్యాణ్ రామ్ తల్లిగా విజయశాంతి కీలక పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌‌గా నటించింది. సోహైల్ ఖాన్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. అజనీష్ లోక్‌‌నాథ్ సంగీతం అందించాడు.

నేడు శుక్రవారం (2025 ఏప్రిల్ 18న) వరల్డ్‌‌వైడ్‌‌గా థియేటర్లలో రిలీజైంది. ఈ క్రమంలో సినిమా ప్రీమియర్స్ ఏప్రిల్ 17న పడ్డాయి. ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు, నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎలా మాట్లాడుకుంటున్నారు? X (గతంలో ట్విట్టర్) రివ్యూలో తెలుసుకుందాం. 

‘కుంతీదేవి కోసం కురుక్షేత్ర యుద్ధం చేసిన అర్జునుడు’ అంటూ ప్రమోషన్స్ చేస్తూ వచ్చారు మేకర్స్. అందుకు తగ్గట్టుగాను తల్లి,కొడుకుల మధ్య ప్రేమ,ఎమోషన్ ఉందని నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు. యాక్షన్ బ్లాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అని, ఇది మొత్తానికి  ఎమోషనల్ యాక్షన్ డ్రామా అని చెబుతున్నారు. కళ్యాణ్ రామ్ పాత్ర చాలా శక్తివంతమైనదిగా ఉందట.

అంతేకాకుండా ఈ సినిమాలో క్లైమాక్స్ ప్రత్యేకంగా ఉందని, అది అందరినీ ఎమోషన్ అయ్యేలా చేస్తుందని ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ నుంచి వినిపిస్తోంది. ఈ సినిమాకి బలమైన పాయింట్స్  'ఎమోషన్స్, క్లైమాక్స్, యాక్షన్ సీన్స్ అనిఆ అంటున్నారు. మొత్తంగా బింబిసారా తర్వాత కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఉందని ఆడియన్స్ X లో మాట్లాడుకుంటున్నారు.

‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ మూవీ అద్భుతమైన క్లైమాక్స్ తో వచ్చింది. కళ్యాణ్ రామ్ పాత్ర శక్తివంతంగా ఉంది. యాక్షన్, ఎమోషన్స్ తో మెప్పించాడు. కళ్యాణ్ రామ్ నటన, విజయశాంతి సన్నివేశాలు, షాకింగ్ క్లైమాక్స్..ఇవి సినిమాకు హైలైట్స్ గా ఉన్నాయి. 
హైలైట్స్. కానీ, ఊహించదగిన స్క్రీన్‌ప్లే, రొటీన్ స్టోరీ, సంగీతం ఇవి సినిమాకు మైనస్ గా నిలిచాయి అంటూ ఓ నెటిజన్ X లో పోస్ట్ చేశాడు. 

అందులో ఒక నెటిజన్స్ స్పందిస్తూ.. 'ఫస్ట్ హాఫ్ ఒక హై యాక్షన్-ప్యాక్డ్ అనుభవాన్ని ఇచ్చింది. చురుకైన వేగంతో, హై ఫీల్ ఇచ్చే కథనాన్ని  డైరెక్టర్ రాసుకున్నాడు. అర్జున్ మరియు వైజయంతి పాత్రలను చక్కగా రూపొందించారు.

కళ్యాణ్ రామ్, విజయశాంతిల కోసం  దర్శకుడు ప్రదీప్ చిలుకూరి బలమైన కథను తీసుకున్నాడు. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. ఇందులో ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి మరియు శ్రీకాంత్ ల నటన సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉందని" X లో పోస్ట్ చేశాడు.

ఒక మంచి ఫార్ములాతో ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’ తెరకెక్కింది. ఊహించని క్లైమాక్స్ తో ఎమోషనల్ అయ్యేలా చేసింది. కళ్యాణ్ రామ్ తన నటనతో మెప్పిస్తాడు. అయితే, కథ రొటీన్ అవ్వడం, మ్యూజిక్ ఇంపాక్ట్ ఇవ్వకపోవడం డిస్సప్పాయింట్ చేస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.