కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్ నటిస్తుండగా, మాళవిక నాయర్ కీలకపాత్ర పోషిస్తోంది.
హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే టీజర్, సాంగ్స్‌తో ఆకట్టుకున్న టీమ్, ఆదివారం మరొక పోస్టర్‌ను విడుదల చేసింది. మాళవిక నాయర్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆమె మణిమేఖల అనే పొలిటీషియన్‌గా నటిస్తోంది. చీరకట్టులో కనిపిస్తున్న ఆమె ఓ పబ్లిక్ మీటింగ్‌లో స్పీచ్ ఇస్తున్నట్టుగా ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. నవంబర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.