మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్ కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యేల సమ్మతి తీసుకొని చెక్కుల పంపిణీకి సిద్ధం చేయాలని కలెక్టర్ జి.రవి నాయక్ తహసీల్దార్లను ఆదేశించారు.
గురువారం తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని, జరిమానా డబ్బులను వెంటనే డీడీల రూపంలో చెల్లించాలని ఆదేశించారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను జాప్యం లేకుండా పరిష్కరించాలన్నారు. 60 రోజులకు పైగా పెండింగ్లో ఉన్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను వెంటనే క్లియర్ చేయాలన్నారు.
ధరణి కింద జీఎల్ఎం, సక్సేషన్ దరఖాస్తులను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇండస్ట్రియల్ కారిడార్లకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, ఎస్ మోహన్ రావు, హౌసింగ్ ఈఈ వైద్యం భాస్కర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కిషన్ రావ్ పాల్గొన్నారు.