ప్రభుత్వం నుంచి మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను ఇవ్వకుండా అధికారులు, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఇబ్బందులు పెడుతున్నారని నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట లబ్దిదారులు ఆందోళనకు దిగారు.
ఈ మధ్య బాజిరెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. అయితే లబ్దిదారుల్లో బీజేపీ కార్యకర్తల చెక్కులను పంపిణీ చేయకుండా నిలిపివేశారు. వీళ్లంతా ఇవాళ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు.