జైనథ్, వెలుగు: రాష్ట్రంలోని బీఆర్ఎస్ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల నిరుపేద కుటుంబాలకు వరం లాంటివని అదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. గురువారం జైనథ్ మండల కేంద్రంలోని మార్కెట్ ఆవరణలో ఆయా గ్రామాలకు చెందిన మొత్తం 62 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు.
ఐకేపీ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళా, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో గజానన్ తదితరులు పాల్గొన్నారు.
ఆడపిల్లలకు అండగా కేసీఆర్
ఆదిలాబాద్టౌన్: నిరుపేద ఆడపిల్లల పెండ్లిళ్ల సమయంలో తల్లితండ్రులపై ఆర్థిక భారం పడకుండా వారికి అండగా సీఎం కేసీఆర్నిలుస్తున్నారని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, వెనుగంటి ప్రకాశ్, ఇబ్బు తదితరులు పాల్గొన్నారు.