బుల్లితెర ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కళ్యాణం కమనీయం సీరియల్‌ని రూపొందించారు. చిన్నతనంలోనే తల్లికి దూరమై తండ్రి దగ్గరే పెరిగిన ఇద్దరు అమ్మాయిల కథ ఇది. తల్లి ఎవరో? ఎలా ఉంటుందో? తెలుసుకోవడానికి వెతుకుతూ వాళ్లు పడే బాధ, కష్టాలే స్టోరీలైన్. సీతారత్నంగా హరిత, చైత్రగా మేఘన లోకేష్, తండ్రిగా సింగర్ మనో, రాక్‌స్టార్ విరాజ్‌గా మధు మెయిన్ లీడ్స్‌లో నటిస్తున్నారు. ఈ నెల 31 నుండి రాత్రి 7:30 గంటలకుఈ సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ అవుతుంది.