Arjun S/O Vyjayanthi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయశాంతి, హీరో కళ్యాణ్ రామ్

Arjun S/O Vyjayanthi: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయశాంతి, హీరో కళ్యాణ్ రామ్

విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. ఏప్రిల్ 18న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు (ఏప్రిల్ 10న) ‘అర్జున్ సన్నాఫ్‌‌ వైజయంతి’ చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

'సినిమా విడుదలకు ముందు స్వామి వారి అశ్శీసులు తీసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అలాగే రానున్న రెండు రోజుల్లో హైదరబాదులో మూవీ ప్రీ రిలీజ్ వేడుక ఉంటుంది. తమ్ముడు ఎన్టీఆర్ హాజరవుతారని' హీరో కళ్యాణ్ రామ్ తెలిపారు.

ఈ మూవీలో 'తల్లి-కొడుకుల సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లు ఈ సినిమాకి ప్రధాన బలంగా ఉంటాయని' చిత్ర బృందం మీడియాకు వెల్లడించింది. విజయశాంతి అండ్ మూవీ టీంతో అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు. 

ఇటీవలే ‘అర్జున్ సన్నాఫ్‌ వైజయంతి’మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ మూవీ రన్‍టైమ్ 2 గంటల 24 నిమిషాలు (144 నిమిషాలు) గా ఉండనుంది.