పంజాగుట్ట, వెలుగు: వివిధ రంగాల్లో నిష్ణాతులై న వారికి విశ్వగురు వరల్డ్రికార్డ్స్ఆధ్వర్యంలో ‘కామ ధేను’ పురస్కారాలను అందజేశారు. టూరిజం ప్లాజాలో సంస్థ సీఈవో సత్యవోలు రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి హైకోర్టు జడ్జి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆధ్యాత్మక రంగం నుంచి డాక్టర్ కొండా నరసింహారావు, అలివేలు మంగ దంపతులు, రచనా రంగంలో ట్రాన్స్జెండర్స్పై తెలుగులో పుస్త కం రాసిన డాక్టర్ ప్రభాకర్, మహిళా మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో ఎం.ఎం. శ్రీలేఖ, జాతీయ ఉత్తమ ఫాదర్ కేటగిరీలో డాక్టర్ మనోజ్, ఉత్తమ తల్లి కేటగిరీలో పోసాని రాణి, సేవారంగంలో కుసుమ భోగరాజు, వైద్యరంగంలో అశ్వని అమరేశ్వర్ పురస్కారాలు అందుకున్నారు.