హైదరాబాద్, వెలుగు: టీఎంటీ బార్లను తయారు చేసి అమ్మే కామధేను లిమిటెడ్తెలంగాణలో విస్తరించాలని నిర్ణయించింది. తమ కొత్త ప్రొడక్టు కామధేను నెక్స్ట్కు ఎంతో ఆదరణ లభించిందని ప్రకటించింది. డిమాండ్‌ను తీర్చడానికి ప్రొడక్షన్ కెపాసిటీని 20 శాతం పెంచుతామని తెలిపింది.
రాబోయే సంవత్సరంలో తన చానెల్ పార్ట్నర్నెట్వర్క్బలోపేతం చేస్తున్నామని కామధేను లిమిటెడ్ డైరెక్టర్ సునీల్అగర్వాల్ తెలిపారు. నాణ్యత, నమ్మకమైన టీఎంటీ బార్లకు మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉందని, ఎంతో పరిశోధన తరువాతే కామధేను నెక్స్ట్ను తయారు చేయగలిగామని వివరించారు. బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు, డ్యామ్స్, థర్మల్, హైడల్ప్లాంట్స్ వంటి భారీ నిర్మాణాలకు ఇది అనువుగా ఉంటుందని చెప్పారు.