విశ్వ నటుడు కమల్ హాసన్(Kamal Hasan),స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 (Bharateeyudu 2).28 ఏళ్ళ తర్వాత కూడా లంచగొండితనం ఏ విధంగా ఉందో,రోజురోజుకూ సమాజంలో అవినీతి ఎలా పెరుగుతూ పోతుందో చూపించడానికి నేడు (జూలై 12న) ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు 2 థియేటర్లో రిలీజయింది.
సామాజిక సమస్యలను తనదైన శైలిలో..కమర్షియల్ సినిమాలుగా తెరకెక్కించడంలోడైరెక్టర్ శంకర్‌కు ప్రత్యేకమైన శైలి ఉంది.ఫస్ట్ ఫిల్మ్ జెంటిల్‌మెన్ నుంచి 2.ఓ వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక సామాజిక సమస్యను టచ్ చేస్తూ వచ్చారు శంకర్.ఈ సోషల్ ఇష్యూకు కమర్షియల్ హంగులను,టెక్నాలజీని జోడించి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంటాడు.మరి నేడు భారీ అంచనాల మధ్య రిలీజైన కం బ్యాక్ 'భారతీయుడు 2'ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
చిత్ర అరవిందన్ (సిద్ధార్థ్) ఓ యూట్యూబర్.ఆర్తి (ప్రియ భవానీ శంకర్) మరో ఇద్దరు స్నేహితులు కలిసి బార్కింగ్ డాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు.వీరందరూ కలిసి అవినీతి,లంచగొండి ఆఫీసర్ల అక్రమాలను రెడ్ హ్యాండెడ్‌గా బయటపెడుతుంటారు.సమాజంలో పేరుకుపోయిన అవినీతి,అన్యాయాల్ని ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తుంటారు.ప్రతి ఒక్కరిని ఎక్కడిక్కడ ముట్టడి చేస్తూ చెమటలు పట్టిస్తుంటారు. దీంతో అరవింద్,అర్తి టీమ్‌కు అడుగడుగున శత్రువులు పెరిగిపోతారు. ఇక వారి జీవితాలు చిక్కుల్లో పడతాయి.
ALSO READ | Bharateeyudu 2 X Review: కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ట్విట్టర్ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే?
ఒక నిరుద్యోగి మరణంతో కడుపు మండి..వీరందరూ భారతీయుడు (సేనాపతి)మళ్లీ తిరిగి వస్తే ఈ లంచాలు తీసుకోవడం ఆగిపోతుంది.ఒక తప్పు చేసినా దాన్నుంచి తప్పించుకోలేమన్న భయం ప్రతి ఆఫీసులోను, అధికారుల్లోనూ రావాలని..సేనాపతి (కమల్‌హాసన్) రావాల్సిందేనని అనుకుంటారు.ఇక అతను వస్తేనే దేశం బాగుపడుతుందంటూ..సేనాపతిని తిరిగి వెనక్కి రప్పించే ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో కం బ్యాక్ ఇండియన్ అనే ఒక క్యాంపైన్ షురూ చేస్తారు.
చైనీస్ తైపే నుంచి మాతృభూమి ఇండియాకు వస్తాడు సేనాపతి. అవినీతిపరులను అంతమొందిస్తుంటాడు. మరోవైపు సేనాపతిని పట్టుకునేందుకు సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) ప్రయత్నిస్తుంటాడు. అయితే,సేనాపతి మళ్లీ ఇండియాలోకి అడుగుపెట్టడానికి అరవింద్‌కు ఏమైనా సంబంధం ఉందా? ఇన్నాళ్లూ సేనాపతి ఎక్కడున్నాడు? తిరిగొచ్చిన తర్వాత ఆయన సమాజంలో కుళ్లుని కడిగేయడం కోసం ఎలాంటి కండిషన్స్ తో తిరిగొచ్చాడు?
అవినీతి నిరోధక శాఖలో పనిచేస్తూ నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న అరవింద్ తండ్రి (సముద్రఖని) గురించి..అరవింద్‌కు ఎలాంటి నిజం తెలిసింది? అరవింద్ అండ్ టీమ్‌కు సహాయం చేసిన దిశ (రకుల్ ప్రీత్ సింగ్) ఎవరు? ఆయన కోసం చాలా కాలంగా సీబీఐ ఆఫీసర్ ప్రమోద్ (బాబీ సింహా) చివరికి భారతీయుడిని అరెస్ట్ చేశాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని వెండితెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే క్లర్క్ నుంచి ఆర్డర్ లిచ్చే అధికారుల వరకు లంచం అనే మాట ఎలా నాటుకుపోయిందో చూపించిన చిత్రం భారతీయుడు. ఈ మూవీలో లంచాల బాటలో పడిన కన్న కొడుకునే చంపేసిన సేనాపతిని ఇప్పటికీ ఎవ్వరు మరిచిపోలేరు.
28 ఏళ్ల తర్వాత ఈ మూవీకి సీక్వెల్గా వచ్చిన భారతీయుడు 2 మూవీని శంకర్ ఎంతో ప్రేస్టీజియస్ ఫిల్మ్గా తెరకెక్కించాడు. ఇప్పుడు అదే సేనాపతి క్యారెక్టర్ ను బేస్ చేసుకుని..28 ఏళ్ళైనా లంచం అనే మాటను వింటూ వస్తోన్న శంకర్ సేనాపతిని అంతే స్ట్రాంగ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తమకున్న అధికారాలను అడ్డంపెట్టుకొని కొందరు నాయకులు ప్రజలను ఎలా దోచుకుంటున్నారు అనే పాయింట్ తో యువత ఏం చేయాలి? ఎలా ఆలోచించాలి? అనేది తనదైన కమర్షియల్ హంగులతో చూపించాడు.
దర్శకుడు శంకర్ అవినీతిపై చెప్పాల్సింది చాలా వరకు 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాలోనే చెప్పారు. ఇందులో ఇంకా ఏం చెప్పాడనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండడటంతో సేనాపతిని చూడాలనుకున్నారు.అయితే, ఈ సినిమాతో మాత్రం సగం కథే చెప్పడంతో ఓ అసంపూర్ణమైన సినిమా చూసిన అసంతృప్తి కలుగుతుంది.ఇండియాకి తిరిగి వచ్చిన భారతీయుడు తానేం చేస్తున్నాననే విషయాన్ని చెప్పకుండా మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోవాలంటూ ఇచ్చిన మెసేజ్ చాలా మందికి కనెక్ట్ అవ్వకపోచ్చు.ఎందుకంటే,అవినీతి మీ అమ్మో నాన్నో లేక అన్నో,అక్కో చేస్తున్నారంటే చాలా మంది తీసుకోలేరు. కానీ అదే మెయిన్ పాయింట్ గా..శంకర్ ఈ సినిమా మొత్తాన్ని నడిపే ప్రయత్నం చేశారు.అలాగే ప్రపంచంలో పేరు మోసిన బ్యాంకుల్లో రుణాలను ఎగవేసి విదేశాల్లోజల్సాలు చేస్తోన్న ఓ వ్యాపారిని అంతం చేసే యాక్షన్ సీన్ తో సేనాపతి ఎంట్రీ ఆకట్టుకుంటుంది. కాకపోతే అక్కడి నుంచే కథాగమనం మొత్తం రొటీన్‌గా మారిపోయింది.ఆ క్రమంలోనే ఒక్కో అవినీతి పరుడిని కమల్ అంతం చేసుకుంటూ వెళ్లిపోవడం బోరింగ్ గా అనిపిస్తుంది. మధ్యలో వచ్చే సిద్ధార్థ్ తండ్రి ఎపిసోడ్ ఠాగూర్ మూవీలోని ఓ సీన్ ను గుర్తుకు తెస్తుంది.ఈ సినిమాలో హైలెట్ గా నిలిచే ఓ మదర్ సెంటిమెంట్ సీన్స్‌ను..శంకర్ మరింత డెప్త్‌గా రాసుకుంటే భారతీయుడు 2 ఇంకా బాగుండేదనే ఫీలింగ్ ఆడియన్స్ లో వస్తుంది.
ఫస్ట్ భారతీయుడు లో మర్మ కళను ప్రస్తావించగా,ఇందులోనేమో వర్మ కళను చూపించారు.అది ఇందులో తీసుకున్న కొత్త పాయింట్ అనిపిస్తుంది.అలాగే ప్రతి ఇంట్లో లంచాలు తీసుకుని,అవినీతి సొమ్ముతో తీసుకొచ్చిన తిండి తినకండి,ఆ సొమ్ముని అనుభవించకండి అంటూ యువతకు ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది.అయితే ఇందులో శంకర్ మార్క్ డైలాగులు,రిచ్నెస్ సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక ఫస్ట్ ఆఫ్ మొత్తం చకచగా జరిగిపోతున్న ఫీలింగ్ కలిగినా సెకండ్ హాఫ్ మాత్రం ఎందుకో కొంత సాగ తీసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది.క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ భారీగా ప్లాన్ చేశారు శంకర్.కానీ లెంగ్త్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుంది.పార్ట్ 3కి సంబంధించి కమల్,కాజల్‌పై వచ్చే అప్‌డేట్ మాత్రం థియేటర్లో ఆడియన్స్ కు గూస్‌బంప్స్‌ను కలిగించింది.
ఎవరెలా చేశారంటే:
సేనాపతిగా కమల్ హాసన్ యాక్టింగ్‌కు భారతీయుడు ఫ్యాన్స్ ఫిదా అవ్వాల్సిందే. యాక్షన్ తో పాటు తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. ఇందులో పూర్తిగా వృద్ధుడైన భారతీయుడు గెటప్‌లోనే కనిపిస్తారు. ఆ గెటప్పుల్లో వైవిధ్యం, పోరాట ఘట్టాలతో మెప్పిస్తాడు. అయితే కమల్ హాసన్ లుక్ విషయంలో శంకర్ జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది.
ALSO READ | Bharateeyudu 2 OTT: 'భారతీయుడు 2' ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్!..స్ట్రీమింగ్ వివరాలివే
సిద్ధార్థ్ కూడా తనధైన శైలిలో నటించే ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.తెరపై కమల్ కంటే సిద్ధార్ద్ ఎక్కువ సేపు కనిపిస్తాడు.ఎమోషనల్ సీన్స్‌లో సిద్ధార్థ్ మెప్పించాడు.రకుల్ ప్రీత్ స్క్రీన్ స్పేస్ తక్కువే అయినా ఉన్నంతలో తనదైన నటన కనబరిచింది.సముద్రఖని,బాబీ సింహ ఇద్దరూ తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. వివేక్ నడిముడి వేణు ఇద్దరినీ ఏఐలో రీ క్రియేట్ చేసి భళా అనిపించారు.SJ సూర్య పాత్ర తక్కువే అయిన కనిపించిన ప్రతిసారి తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నాడు.ప్రియ భవానీ శంకర్ కీలకమైన పాత్రల్లో నటించి మెప్పించింది.
టెక్నీకల్ విషయానికి వస్తే:
డైరెక్టర్ కథనం వైపు ఆలోచించిన తీరు బాగుంది.కానీ,భారతీయుడు తో కంపేర్ చేస్తూ సీక్వెల్ చూస్తే..పూర్తిగా ఆడియెన్స్ డిసపాయింట్ అయ్యేలా చేశాడు. కథ,కథనాల పరంగా శంకర్ మార్కు ఎమోషన్స్,మ్యాజిక్ ఈ సినిమాలో ఎక్కడ కనిపించదు. మేకింగ్ పరంగా ఆయన మార్క్ కనిపించినా ఇదివరకటిలా తనదైన ప్రమాణాలతో బలమైన ప్రభావం కథలో చెప్పలేకపోయారు.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా సాంగ్స్ రెహమాన్ చేసుంటే వేరే లెవెల్ లో ఉండేది.కం బ్యాక్ ఇండియా సాంగ్ మాత్రమే ఆడియన్స్ లో హమ్ అవుతుంది.రవివర్మన్ కెమెరా పనితనం మెప్పిస్తుంది.ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఇంకాస్తా బెటర్ గా చేస్తే బాగుండేది.ఇండియన్ 3లో చూపిస్తాడేమో.