Bharateeyudu 2 X Review: కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ట్విట్టర్ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే?

Bharateeyudu 2 X Review: కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ట్విట్టర్ రివ్యూ..టాక్ ఎలా ఉందంటే?

విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ 'ఇండియన్ 2(భారతీయుడు 2 తెలుగులో).1996లో వచ్చిన సూపర్ హిట్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు.

ఇవాళ శుక్రవారం (జూలై 12న) పాన్ ఇండియా లెవల్లో రిలీజైన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్, ప్రమోషన్స్ వీడియోస్ కూడా ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి.ఇప్పటికే కొన్ని చోట్ల ఫస్ట్ షోలు పూర్తయ్యాయి. మరి భారతీయుడు ఫ్యాన్స్ అంచనాలను ఎలా అందుకుందో ఫస్ట్ ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.ఈ రివ్యూ సోషల్ మీడియాలో సినిమా చూస్తున్న వారి సొంత అభిప్రాయం మాత్రమే అని గమనించాలి. 

ట్విట్టర్ ఎక్స్‌లో ‘భారతీయుడు 2’కి ఆడియన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్‌ వస్తోంది.సినిమా బాగుందని కొంతమంది కామెంట్‌ చేస్తుంటే..అంతగా ఆకట్టుకోలేకపోయిందని మరికొంత మంది ట్వీట్‌ చేస్తున్నారు. అయితే, సోషల్‌ మీడియాలో చాలా వరకు నెగెటివ్‌ టాకే వినిపిస్తోంది. కొంతమంది అయితే ఈ చిత్రానికి నిజంగానే శంకర్‌ దర్శకత్వం వహించాడా అని అనుమానం కూడా వ్యక్తం చేస్తూ కామెంట్స్  చేస్తున్నారు. 

మంచి ఎమోష‌న‌ల్ సీన్‌తో ఈ సినిమా స్టార్ట్ అవుతుందని చెబుతున్నారు.స‌మ‌కాలీన‌ స‌మాజంలో పేరుకుపోయిన అవినీతి,అన్యాయాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఓపెనింగ్ ఎపిసోడ్స్ లో శంక‌ర్ చూపించార‌ని కామెంట్స్ చేస్తున్నారు.సేనాప‌తి ఎంట్రీ త‌ర్వాతే క‌థ‌లో వేగం త‌గ్గుతుంద‌ని,సినిమా మొత్తం బోరింగ్, అవుట్‌డేటెడ్ స్క్రీన్‌ప్లేతో సాగుతుంద‌ని చెబుతోన్నారు.డైలాగ్స్‌,ఎమోష‌న్స్ ఆర్టిఫీషియల్ గా సాగిన ఫీలింగ్ కలుగుతుందని,ఇండియన్ లోని సోల్ సీక్వెల్ లో మిస్సయిందని ట్వీట్స్ చేస్తోన్నారు.

ఫస్ట్ ఆఫ్ చూసిన ఓ వ్యక్తి ట్విట్టర్ లో తన ఫీలింగ్ షేర్ చేస్తూ..సినిమా బాగుంది.కానీ ఇదివరకు ఉన్న శంకర్ సార్ స్క్రీన్‌ప్లేని మరింత గ్రిప్పింగ్ గా చూపించలేదని..చాలా ఊహాజనితంగా స్టోరీ, సీన్స్ విసుగు పుట్టించేలా చేస్తుందని తెలిపారు. 

డైరెక్టర్ శంకర్ తన "ఆస్థాన రచయిత"సుజాత గారిని ఖచ్చితంగా మిస్ అవుతున్నాడు.ఆయన కాలం చేసాక భారతీయుడు2కి  గట్టిగ దెబ్బ పడింది!!! 

అత్యున్నత స్థాయి దర్శకత్వం వహించిన దర్శకుడు శంకర్‌కి హ్యాట్సాఫ్.కమల్ హాసన్ పూర్తి ప్రదర్శన. సినిమా సోషల్ మెసేజ్ ప్రతి ప్రేక్షకులకు చేరుతుంది. ఓవరాల్ గా సినిమా సాధారణ ప్రేక్షకుల హృదయాన్ని గెలుచుకుంటుంది. 

ఇప్పుడే ఫస్టాఫ్‌ కంప్లీట్‌ అయింది. మూవీ ప్రారంభం బాగానే ఉంది. కానీ కథ ముందుగు సాగుతున్నకొద్ది బోరింగ్‌గా అనిపించింది. శంకర్‌ స్క్రీన్‌ప్లే ఆకట్టుకోలేకపోయింది. గ్రిస్పింగ్‌గా, ఎగ్జైట్మెంట్‌ చేసే సీక్వెన్స్‌లేవి లేవు. సెకండాఫ్‌ బాగుండాల్సి ఉంది’అని ఇంకో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

డైరెక్టర్‌ శంకర్‌కి హాట్సాఫ్‌. అద్భుతంగా సినిమాని తెరకెక్కించాడు. కమల్‌ హాసన్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సోషల్‌ మెసేజ్‌ ప్రతి ఆడియన్‌కి రీచ్‌ అవుతుంది. నార్మల్‌ ఆడియన్స్‌ మనసును కూడా ఆకట్టుకునేలా సినిమా ఉంది’ అంటూ ఓ నెటిజన్‌ తనదైన రేటింగ్‌ ఇచ్చాడు.

 భారతీయుడు 2 డిజాస్టర్‌ మూవీ. బోరింగ్‌, ఔడేటెడ్‌ స్టోరీ. సాగదీశారు. ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. డైరెక్టర్‌ శంకర్‌ పని అయిపోయింది’ అంటూ మరో నెటిజన్‌  కామెంట్ చేశాడు