తమిళ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar),తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (Indian 2).1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు (Bharateeyudu)సినిమాకు సీక్వెల్ గా శుక్రవారం (జూలై 12న) వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.ముందు నుంచి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లంచగొండి తనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు పడిపోతున్నాయి.
మూడో రోజైన ఆదివారం (జూలై 14)దేశవ్యాప్తంగా ఈ సినిమాకు రూ.15.1కోట్లు రాగా..అందులో తమిళ వెర్షన్ కే రూ.11 కోట్లు వచ్చాయి. ఇక తెలుగులో రూ.2.8కోట్లు,హిందీ వెర్షన్ కు రూ.1.3కోట్లు మాత్రమే కలెక్షన్స్ దక్కించుకుంది.అందులోనూ తమిళ మార్కెట్ నుంచే దాదాపు 80 శాతం వసూళ్లు రావడం విశేషం.
ఇకపోతే,ఈ సినిమా ఫస్ట్ దేశవ్యాప్తంగా కేవలం రూ.26కోట్లు మాత్రమే రాబట్టింది.తమిళంలో రూ.17 కోట్లు,తెలుగులో రూ.7.7కోట్లు మరియు హిందీ వెర్షన్‌లో కేవలం రూ.1.2కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు,హిందీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోవడంలో ఈ మూవీ పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవాలి.
మొదటిరోజు కంటే రెండో రోజు ఈ కలెక్షన్లు రూ.18.2కోట్లకు పడిపోగా..మూడో రోజు కేవలం రూ.15 కోట్లు మాత్రమే వచ్చాయి.దీంతో భారతీయుడు 2 మూవీ అన్ని వెర్షన్లు కలిపి ఫస్ట్ వీకెండ్ దేశవ్యాప్తంగా కేవలం రూ.58.9 కోట్లు మాత్రమే రాబట్టింది.ఈ వీకెండ్ కలెక్షన్స్ బట్టి చూసుకుంటే,రానున్న రోజులలో మరింత డీలా పడే ఛాన్స్ ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే,లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కమల్ హాన్ విక్రమ్ ఫస్ట్ డే రూ.60 కోట్ల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇక రీసెంట్ గా కమల్‌హసన్ విలన్‌గా నటించిన కల్కి 2898 AD మూవీ ఫస్ట్ డే ఏకంగా రూ.190 కోట్ల వసూళ్లను దక్కించుకుంది.
అలాగే 2018లో విడుదలైన కమల్ హాసన్ 'విశ్వరూపం 2'కూడా ఫస్ట్ పార్ట్ వలె బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు.మొదటి భాగం 'విశ్వరూపం'ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రూ.20కోట్లు వసూలు చేయగా,సీక్వెల్ మాత్రం ఫస్ట్ డే రూ.7.7 కోట్లు వసూలు చేయగలిగింది.
అంతే కాకుండా శంకర్ లాస్ట్ మూవీ రోబో 2.ఓ ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 93 మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ మూవీలో సగం వసూళ్లను కూడా ఇండియన్ 2కు రాబట్టలేకపోవడంలో బాక్సాఫీస్ వర్గాలను విస్మయపరుస్తోంది.