Indian 2 OTT: మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి ఇండియన్ 2..బడ్జెట్ రూ.225 కోట్లు..వచ్చింది తెలిస్తే షాక్!

Indian 2 OTT: మరో రెండ్రోజుల్లో ఓటీటీలోకి ఇండియన్ 2..బడ్జెట్ రూ.225 కోట్లు..వచ్చింది తెలిస్తే షాక్!

తమిళ అగ్ర దర్శకుడు శంకర్ (Shankar),తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2 (Indian 2).1996లో వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు (Bharateeyudu)సినిమాకు సీక్వెల్ గా శుక్రవారం (జూలై 12న) వరల్డ్ వైడ్ గా రిలీజై మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.ఇప్పుడు ఈ సినిమా నెల రోజులు కూడా కాక ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరో రెండ్రోజుల్లో(ఆగస్ట్ 9న) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో సహా తెలుగు,మలయాళ, కన్నడ,హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి రానుంది. 

ఇండియన్ 2 బాక్సాఫీస్..

ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజైన నేపథ్యంలో ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.65 కోట్ల ఓపెనింగ్ లభించినా..నెగటివ్ రివ్యూలతో బాక్సాఫీస్ లెక్కలు క్రమంగా తగ్గుతూ వెళ్లాయి. కాగా తమిళంలో ఈ ఏడాది (2024లో) అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇండియన్ 2 నిలిచినప్పటికీ..తెలుగుతోపాటు ఇతర భాషల్లో మాత్రం డిజాస్టర్ టాక్తో పాటు దారుణమైన కలెక్షన్లతో డీలా పడింది. 

ఈ సినిమాను మేకర్స్ దాదాపు రూ.225 కోట్ల బడ్జెట్తో నాలుగేళ్ల పాటు తెరకెక్కించిన బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశ పరిచింది. కమల్ హాసన్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి వచ్చింది కేవలం రూ.148 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే. షేర్ ఇంకా చాలా చాలా తక్కువే అని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.ఇక ఆ లెక్కన చూస్తే నిర్మాతలకు సుమారు రూ.100 కోట్లకుపైనే నష్టాలు మిగిల్చింది.

పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య,బాబీ సింహా,సిద్దార్థ్‌,స‌ముద్రఖని,లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,ప్రియా భ‌వానీ శంక‌ర్‌,కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మించారు.