![Bharateeyudu 2: భారతీయుడు 2 సెన్సార్ పూర్తి.. సలార్, కల్కి తరహాలోనే ఇది కూడా!](https://static.v6velugu.com/uploads/2024/07/kamal-haasan-bharateeyudu-2-movie-completed-by-censor_Vhm3Gf5YJe.jpg)
విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2(భారతీయుడు 2 తెలుగులో). 1996లో వచ్చిన సూపర్ హిట్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా ఉండటంతో ఆ మరింత పెరుగుతున్నాయి.
ఇక పార్టీ 1 మాదిరిగానే సోషల్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్ జె సూర్య, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. ఇందులో భాగంగానే తాజా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది భారతీయుడు 2 మూవీ. మూడు గంటలకు పైగా రన్ టైంతో వస్తున్న ఈ సినిమాకు సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంతేకాదు.. అభ్యంతరంగా ఉన్న కొన్ని సన్నివేశాలను కూడా కట్ చేయాల్సిందిగా సెన్సార్ సూచించిందని సమాచారం.
ఇక ఈ మధ్య వస్తున్న దాదాపు అన్నీ సినిమా దాదాపు మూడు గంటల నిడివితో వస్తున్నవే. రంగస్థలం, యానిమల్, సలార్, కల్కి.. ఈ సినిమాలన్నీ మూడు గంటల రన్ టైంతో వచ్చినవే. ఇప్పుడు భారతీయుడు 2 కోసం కూడా మేకర్స్ అదే రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు. మరి అంతసేపు ఆడియన్స్ ఓపికగా సీట్లలో కూర్చోవాలి అంటే ఆ రేంజ్ కంటెంట్ ఉండాలి. మరి భారతీయుడు 2 కోసం శంకర్ ఎలాంటి కంటెంట్ తయారు చేశారో చూడాలి.