Bharatiyadu 2 movie Review : భారతీయుడు 2 స్టోరీ ఇదే.. బొమ్మ హిట్టా? ఫట్టా?

భారతీయుడు సూపర్ సక్సెస్ తర్వాత 28 యేళ్లకు సీక్వెల్ థియెటర్స్ లోకి వచ్చింది. విశ్వనటుడు కమల్ హాసన్, మెగా డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కింది భారతీయుడు 2. మరి ఫస్ట్ పార్ట్ లాగే సీక్వెల్ కూడా ప్రేక్షకులను అంతలా మెప్పించిందా. లేదా రివ్యూలో తెలుసుకుందాం.

సమాజంలోని  అవినీతి, అక్రమాలు, లంచగొండితనం మీద సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లు సిద్దార్ద్, ప్రియాభవానీ శంకర్ ల టీం బార్కింగ్ డాగ్స్ అనే  యూ ట్యూబ్ ద్వారా వీడియోలు చేస్తూ వుంటారు. దీంతో కొందరు పోలీసులు ఇతర అధికారుల నుంచి వ్యతిరేక వస్తుంది. దీంతో తమను ఆదుకోవడానికి , అవినీతి వ్యతిరేకంగా పోరాడడానికి భారతీయుడు తిరిగి రావాలని కోరుకుంటారు. ఎక్కడ వున్నాడో తెలియని భారతీయుని కోసం కం బ్యాక్ ఇండియన్ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తారు. దీంతో తైపీ వున్న భారతీయుడు తిరిగి ఇండియాకు వచ్చి అన్యాయాలు అక్రమాలు చేస్తున్న వారిని అంతమొందిస్తుంటాడు. మరో వైపు భారతీయుడిని పట్టుకునేందుకు సిబిఐ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ వుంటుంది. 

ALSO READ | Bharateeyudu 2 Review: భార‌తీయుడు 2 రివ్యూ -సేనాప‌తిగా క‌మ‌ల్ మెప్పించాడా?..శంక‌ర్ మార్కు ఎలా ఉంది?

ఈ క్రమంలో భారతీయునికి  ఇన్ ప్లూయెన్స్ అయిన సిద్దార్ద్ బ్యాచ్ చాలా మంది అవినీతి పరులను పోలీసులకు పట్టిస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల సిద్దార్ద్ బ్యాచ్ తో పాటు ప్రజలు కూడా భారతీయునికి వ్యతిరేక మవుతారు. అతడిని పట్టుకోవడానికి అవినీతి పరుల టీం, సామాన్య ప్రజలు, పోలీసులు అందరూ కలిసి ప్రయత్నిస్తుంటారు. అవినీతి పరుల భరతం పడుతున్న భారతీయుడిని సిద్దార్ద్ టీం ఎందుకు అసహ్యించుకుంటుంది. సామాన్య ప్రజలు కూడా అతడిని పట్టుకుని చంపెయ్యాలి అన్నంత కోపం ఎందుకు వస్తుంది. సిబిఐ ఎందుకు అరెస్ట్ చెయ్యాలనుకుంటుంది అనేది మూవీ లో చూడాల్సిందే.

28  యేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు అన్యాయం , అవినీతి మీద పోరాటం చేసినట్టే సీక్వెల్ లో కూడా అదే మెయిన్ కాన్సెప్ట్ గా తెరకెక్కింది భారతీయుడు 2.  ఫస్ట్ పార్ట్ లో భారతీయుడు ఒక్కడే పోరాటం చేస్తే సీక్వెల్ లో సోషల్ మీడియా ద్వారా సిద్దార్ద్ అండ్ బ్యాచ్ ను యాడ్ చేశారు.  మూవీ ఫస్ట్ హాఫ్ కొత్తదనం పెద్దగా కనిపించదు.  సెకండాఫ్ లో ట్విస్ట్ లు, ఎమోషన్స్ మూవీని ఇంట్రెస్టింగ్ ట్రాక్ మీదకు తీసుకువస్తాయి.  క్లైమాక్స్ సాగదీసినట్టుగా వుంటుంది.  డైరెక్టర్ శంకర్ ఫస్టాఫ్ లో గ్రిప్పింగ్ సీన్స్, ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ కాలేక పోయాడు. కమల్ హాసన్ తనదైన నటనతో మరోసారి వహ్వావ్ అనిపించాడు. సిద్దార్ద్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె. సూర్య, బాబీ సింహ, సముద్రఖని, గుల్షన్ గ్రోవర్ లు తమ పాత్రలకు న్యాయం చేశారు.
ఇక టెక్నికల్ విషయాలకు వస్తే అనిరుధ్ సంగీతం అన్ని చోట్లా మెప్పించలేకపోయింది.రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మూవీకి హైలైట్.ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాల రిచ్ గా వున్నాయి.

మొత్తంమీద భారతీయుడు రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేసి సీక్వెల్ కి వెళ్తే కొంత నిరాశపరిచే అవకాశం వుంది.మూవీ చివర్లో 3 పార్ట్ కోసం ఇచ్చిన ట్విస్ట్ బాగనిపిస్తుంది.