తమిళ దర్శకుడు శంకర్(Shankar) నుండి వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2(Indian 2). 1996లో వచ్చిన భారతీయుడు(Bharateeyudu) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. లంచగొండి తనాన్ని ఇక ఉపేక్షించేది లేదు అంటూ వస్తున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో జరిగింది. ఎంతో ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ కు చిత్ర యూనిట్ తోపాటు ప్రముఖులు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న న్యూస్ తో ఆడియన్స్ అవాక్కవుతున్నారు. అదేంటంటే.. ఈ సినిమాలో కమల్ హాసన్ ఇండియన్ పాత్రలో కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడట. ఇక మెయిన్ హీరోగా సిద్దార్థ్ కనిపిస్తారని సమాచారం. దీంతో కమల్ ఫ్యాన్స్ షాకవుతున్నారు. నిజానికి ఇండియన్ 2 అంటే సినిమాలో కమల్ హాసన్ దే ప్రధాన పాత్ర అనుకున్నారు అంతా. కానీ, ప్రస్తుత సమాచారం మేరకు సినిమా మొదలైన దాదాపు 20 నిమిషాల తరువాత మాత్రమే కమల్ ఎంట్రీ ఉంటుందట.
ఇక కమల్ నటించిన గత చిత్రం విక్రమ్ లో కూడా కేవలం 40 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇపుడు ఇండియన్ 2 కోసం కూడా కేవలం 40 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ ను తీసుకుంటారట కమల్. ఈ సినిమా కూడా భారీ విజయన్నీ సాదించనుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది అనేది తెలియాలంటే జులై 12వరకు ఆగాల్సిందే.