
చెన్నై: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలు ఏకం అవుతున్నాయి. డీలిమిటేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. ఈ అంశంలో ద్రావిడ పార్టీలు మరింత ఆవేశంగా ఉన్నాయి. మరో 30 ఏండ్ల వరకు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవద్దని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇందులో భాగంగానే డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తమిళనాడు రాజధాని చెన్నైలో బుధవారం (మార్చి 5) అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రతిపక్ష అన్నాడీఎంకే, విజయ్ టీవీకే పార్టీ ప్రతినిధులు, కాంగ్రెస్, కమల్ హాసన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్ విభజన చేస్తే తమిళనాడుకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఎంపీ స్థానాల పునర్ విభజనకు బదులు ఎమ్మెల్యేల స్థానాలు పెంచాలని డిమాండ్ చేశారు.
ALSO READ | ఒక్కటవుతున్న దక్షిణాది.. డీలిమిటేషన్ 30 ఏండ్లు ఆపాలని డిమాండ్
డీలిమిటేషన్ ద్వారా సవ్యంగా నడిచే ప్రజాస్వామ్యాన్ని గ్యారేజీకి పంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఫైర్ అయ్యారు. ఇండియాను హిందియాగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. హిందీ ద్వారా ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. మా కల ఇండియా అయితే.. బీజేపీ కల హిందియా అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనాభా గణనను దాటవేయడం ఉన్న నిజమైన కారణం ఏంటని ప్రశ్నించిన కమల్.. హిందీయాను సృష్టించే భాగంలోనే జనాభా గణన చేపట్టడం లేదని ఆరోపించారు. నియోజకవర్గాలను ఎలా పునర్నిర్మించినా ఎక్కువగా ప్రభావితమయ్యేది ఎల్లప్పుడూ హిందీ మాట్లాడని రాష్ట్రాలేనని.. ఈ చర్య సమాఖ్యవాదాన్ని బలహీనపరుస్తుందని.. ఇది అనవసరమని కమల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.