ఇండియన్2 మూవీ నుండి బిగ్ అప్డేట్.. సేనాప‌తికి కాపీ అందింది

లోకనాయకుడు కమల్ హాసన్(Kamal haasan) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ఇండియన్ 2(Indian). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో కాజల్ అగర్వాల్(Kajal agarwal) హీరోయిన్ గా నటిస్తున్నారు. 1996లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా మేకింగ్ కూడా ఉండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుండి బిగ్ అప్డేట్ ఇచ్చారు దర్శకుడు శంకర్. ఇండియాను 2 నుండి 29న బిగ్ అప్డేట్ రానుందని తెలుపుతూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశాడు. ఈ పోస్టర్ లో సేనాపతికి కాపీ అందింది అంటే క్యాప్షన్ ను జత చేశాడు. ఈ ఒక్క క్యాప్షన్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. అయితే రేపు(అక్టోబర్ 29) ఇండియన్2 గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వనున్నారు అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంచాడు.

Also Read :- పెళ్లికోసం ఇటలీ బయల్దేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

ఇక ఇండియన్2 సినిమా విషయానికి వస్తే.. రెడ్‌ జెయాంట్‌, లైకా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరో సిద్దార్థ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.