ఐకానిక్ గెటప్‌‌‌‌లో కమల్ హాసన్​

 ఐకానిక్ గెటప్‌‌‌‌లో కమల్ హాసన్​

తన సినిమాల్లోని గెటప్స్‌‌‌‌  కోసం కమల్ హాసన్ స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఆయన వేసిన గెటప్స్ లో కొన్నింటిని ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేరు. వాటిలో ‘భారతీయుడు’ చిత్రంలోని సేనాపతి గెటప్ ఒకటి. దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. 

ఇప్పటికే ఎనభై శాతం పైగా షూటింగ్ పూర్తయింది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళవారం ‘ఇండియన్ 2’ నుంచి కమల్ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేశారు దర్శకుడు శంకర్. ఇందులో ‘భారతీయుడు’గా ఐకానిక్ గెటప్‌‌‌‌లో ఆకట్టుకున్నారు కమల్. 

కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌‌‌‌సింగ్, ప్రియా భవానీశంకర్  హీరోయిన్స్‌‌‌‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో  సిద్ధార్థ్​, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, మనోబాల, వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌‌‌‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్‌‌‌‌ నిర్మిస్తున్నారు.  సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.