ఇళయరాజా (Ilaiyaraaja)..ఈ పేరు తలవకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడటం చాలా కష్టం. తన సంగీతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేశారు. ఇప్పటికే 1400 వందలకు పైగా సినిమాలకు సంగీతం అందించి రికార్డ్ క్రియేట్ చేశారు ఈ సంగీత జ్ఞాని. స్వరమాంత్రికుడు ఇళయరాజా బయోపిక్ నిన్న (మార్చి 20న) గ్రాండ్ గా లాంచ్ అయింది.
భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సంగీతకారులలో ఒకరైన ఇళయరాజా పాత్రలో కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ ధనుష్ నటిస్తున్నాడు. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ సినిమాకు విశ్వనటుడు కమల్ హాసన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిన్న జరిగిన బయోపిక్ లాంచ్ ఈవెంట్ లో స్వయంగా కమల్ ప్రకటించారని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. త్వరలో ఏ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ALSO READ :- హ్యాపీ జర్నీ : హోలీ పండక్కి.. 540 ప్రత్యేక రైళ్లు
ఈ సినిమాకు అరుణ్ మాతేశ్వరణ్ తెరకెక్కిస్తున్నాడు. పీకే ప్రైమ్ ప్రొడక్షన్ వారు అలాగే మెర్క్యూరీ మూవీస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి డిఓపిగా నీరవ్ షా ..ఆర్ట్ డైరెక్టర్‌గా ముత్తురాజ్ ఉన్నారు. ఈ బయోపిక్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది రిలీజవుతుంది. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.