Bharateeyudu 2 OTT: 'భారతీయుడు 2' ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్!​..స్ట్రీమింగ్ వివరాలివే

విశ్వనటుడు కమల్ హాసన్,విలక్షణ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన'భారతీయుడు 2'మూవీ గ్రాండ్‌గా నేడు జూలై 12న గ్రాండ్ గా రిలీజయింది. ఈ నేపథ్యంలో సినిమా బాగుందంటూ చాలా చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది.ఇంకొన్ని చోట్ల మాత్రం మిక్సెడ్ టాక్ తో నడుస్తుంది.

28 ఏళ్ల తర్వాత ఇండస్ట్రీ హిట్ భారతీయుడు సీక్వెల్ రావడంతో ప్రజలు థియేటర్స్ కి ఎగబడుతున్నారు.అందుకు కారణం భారతీయుడు సినిమా ఏర్పరిచిన క్రెజ్..చూపించిన పవర్ ఫుల్ మెసేజ్.ఇపుడు ఇదొక్కటే సినిమా చూడాలనే బలమైన సంకల్పం. 

ALSO READ : OTT Movies: ఈ వారం ఓటీటీలో మాస్టర్ పీస్ సినిమాలు, వెబ్ సిరీస్ లివే!

అయితే,ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన వెంటనే..ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కావొచ్చు అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయుడు 2 సినిమా హక్కులను ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తంలో తీసుకున్నట్లు సమాచారం. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి భారతీయుడు 2స్ట్రీమింగ్ కానుంది.ఇక సినిమా స్ట్రీమింగ్ డేట్ కు సంబంధించి వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది .

అలాగే, ఈ సినిమా చివర్లో భారతీయుడు 3కి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు శంకర్.ఇటీవలే కేరళ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పార్ట్ 3 ట్రైలర్ ఉంటుందని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఇకపోతే,అసలు సబ్జెక్టు మొత్తం భారతీయుడు 3లోనే ఉండబోతుందని జోరుగా పబ్లిక్ నుంచి టాక్ వస్తోంది.

పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య,బాబీ సింహా,సిద్దార్థ్‌,స‌ముద్రఖని,లెజెండరీ కమెడియన్‌ బ్రహ్మానందం, మధుబాల, ర‌కుల్ ప్రీత్ సింగ్,ప్రియా భ‌వానీ శంక‌ర్‌,కీలక పాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మించారు.

Also Read:భార‌తీయుడు 2 రివ్యూ -సేనాప‌తిగా క‌మ‌ల్ మెప్పించాడా?..శంక‌ర్ మార్కు ఎలా ఉంది?