
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఏడీ(Kalki 2989 AD). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Pabhas) హీరోగా వస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ దాదాపు రూ.700 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకిక్కిస్తోంది. ఇండియన్ మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లుక్స్, విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా సినిమా నెక్స్ట్ లెవల్లో ఉండటంతో ఆ అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
అయితే.. ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఆయన పాత్రగానీ, సినిమాలో ఆయన లుక్ గానీ ఇప్పటివరకు రివీల్ కాలేదు. దాంతో.. సినిమాలో ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో ఆసక్తిపెరిగింది. ఈక్రమంలోనే.. కల్కి సినిమా నుండి కమల్ లుక్ లీక్ అయ్యింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో యంగ్ లుక్‌లో కనిపిస్తున్నారు కమల్ హాసన్. ప్రభాస్ మాదిరిగానే సూపర్ హీరో కాస్ట్యూమ్ ధరించి, లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఈ లుక్ కి నెటిజన్స్ నుండి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. మరి ఈ లుక్ నిజమైనదేనా.. లేక ఎడిటెడా అనేది ఇంకా క్లారిటీ లేదు.
ఇక కల్కి సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొనె, దిశా పటాని నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామగా కనిపించనున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.