Kamal, Pawan: సోదరా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. పవన్ విజయంపై కమల్ కామెంట్స్

Kamal, Pawan: సోదరా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది.. పవన్ విజయంపై కమల్ కామెంట్స్

ఇటీవల ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే. పోటీచేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాల్లో గెలిచి రికార్డ్ విజయాన్ని అందుకున్నారు జనసేనాని. దీంతో.. పవన్ కళ్యాణ్ పై దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తాజాగా ఈ లిస్టులో లోకనాయకుడు కమల్ హాసన్ కూడా చేరిపోయారు. తాజాగా ఆయన తన ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్ విజయంపై స్పందించారు.. ఎన్నికల్లో విజయంపై పవన్‌తో జరిగిన సంభాషణ చాలా ఉద్వేగభరితంగా సాగింది. అందుకు పవన్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఏపీ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు సేవ చేసే ఆలోచనతో ఈ యాత్రను ప్రారంభించినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాన . సోదరా పవన్.. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది..  అంటూ ట్వీట్ చేశారు కమల్. ప్రస్తుతం కమల్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.