
ప్రముఖ నటుడు కమల్ హాసన్, త్రిష, శింబు నటించిన థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రమోషన్లో పాల్గొన్న కమల్ హాసన్, త్రిష, శింబులను పెళ్లిపై మీ అభిప్రాయం యాంకర్ అడగ్గా కమల్ హాసన్ తన రెండు పెళ్లిళ్ల గురించి సంచలన విషయాలను బయటపెట్టారు.
మొదట త్రిషను యాంకర్ పెళ్లిపై మీ అభిప్రాయం చెప్పండి అడగ్గా..‘‘ పెళ్లిపై నాకు పెద్దగా నమ్మకం లేదు.. పెళ్లి చేసుకున్న పర్వాలేదు.. చేసుకోకున్నా పర్వాలేదు అని సమాధానం చెప్పింది. అయితే ఇదే క్వశ్చన్ ను కమల్ హాసన్ ను అడిగితే.. ఆయన పదేళ్ల క్రితం ఎంపీ జాన్ బ్రిటాస్ తో జరిగిన ఓ సంఘటనను వివరించారు.
Also Read:-తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమంత.. టీటీడీ డిక్లరేషన్పై సంతకం
తమిళ్లో మాట్లాడిన కమల్ వ్యాఖ్యలను వారి మాటల్లోనే చూద్దాం..‘‘ఇది 15 ఏళ్ల క్రితం మాట.ఎంపీ బ్రిట్టాస్ నాకు మంచి స్నేహితుడు. ఆయన నన్ను కొంతమంది కాలేజీ విద్యార్థుల ముందు ఇదే క్వశ్చన్ అడిగారు.బ్రాహ్మణ కుటుంబంలో పుట్టావు..రెండుసార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగారు. నేను ఇలా అన్నాను..మంచి కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం నుంచి రావడానికి వివాహానికి సంబంధం ఏంటని అడిగాను అన్నారు. తర్వాత బ్రిట్టాస్ అంతటితో వదలకుండా ‘‘మీరు రాముడిని పూజిస్తారు. ఆయన జీవించిన విధంగా జీవిస్తారు కదా ’’అని అన్నారు. దానికి నేను ఇలా చెప్పాను.‘‘మొదట నేను దేవుడిని ప్రార్థించను.. నేను రాముడి మార్గాన్ని అనుసరించను..బహుశా నేను అతడి తండ్రి దశరథుడి మార్గాన్ని అనుసరించి ఉండొచ్చు అని సమాధానం చెప్పాను అన్నారు.
కమల్ హాసన్ పెళ్లిళ్ల చరిత్ర..
కమల్ హాసన్ 1978లో మొదట నర్తకి వాణి గణపతిని వివాహం చేసుకున్నారు. 1975లో ఈమె కమల్ తో మెల్నాట్లు మరుమగల్ సినిమాలో నటించారు. దాదాపు పదేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారికతో డేటింగ్ చేశారు. 1986లో మొదటి సంతానం శృతిహాసన్ పుట్టాక 1988లో పెళ్లి చేసుకున్నారు. తర్వాత 1991లో వారికి కుమార్తె అక్షర హాసన్ జన్మించారు. సరిగ్గా పదేళ్ల తర్వాత కమల్ హాసన్, సారికలు విడిపోయారు. ఆ తర్వాత కమల్ 2005నుంచి 2016వరకు నటి గౌతమితో డేటింగ్ చేశారు. కమల్ హాసన్ మొదటినుంచి అనేక ఇంటర్వ్యూలో తాను పెళ్లికి తగినవాడిని కాదని చెబుతూ వస్తున్నారు.
ఇక ఇటీవలకాలంలో కమల్ హాసన్ సినిమా కెరీర్ గురించి మాట్లాడితే..శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమాలో చివరిసారిగా కనిపించిన కమల్..త్వరలోనే ఆ సినిమా సీక్వెల్ ఇండియన్ 3 లో నటించనున్నాడు. అతని తదుపరి చిత్రం థగ్ లైఫ్ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.