Kamal Haasan: ఈ ప్రశ్న అడిగినందుకు సిగ్గుగా ఉంది.. కమల్ హాసన్ షాకింగ్ రిప్లై

Kamal Haasan: ఈ ప్రశ్న అడిగినందుకు సిగ్గుగా ఉంది.. కమల్ హాసన్ షాకింగ్ రిప్లై

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2(ఇండియన్ 2). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, బాబీ సింహ, ఎస్ జే సూర్య తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. 1996లో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇటీవల విడుదలైన భారతీయుడు 2 ట్రైలర్ తరువాత ఆ అంచనాలు మరింత పెరిగాయి. దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. 

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా జులై 12న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల మూవీ ప్రెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమంలో భారతీయుడు సినిమా యూనిట్ కు ఓ వింత ప్రశ్న ఎదురయ్యింది. ఓ రిపోర్టర్ సినిమాలో సేనాపతి వయసు ఎంత? ఆ వయసులో ఆయన ఫైట్స్ ఎలా చేయగలుగుతున్నాడు? అంటూ అడిగాడు. దానికి సమాధానంగా కమల్ అదిరిపోయే కౌంటర్ వేశారు. 

సినిమాలో సేనాపతి వయసు గురించి అడుగుతుంటే నాకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. నిజానికి ఈ ప్రశ్నకి జవాబు చెప్పకూడదు కానీ..  నేను చెబుతాను. మీరెప్పుడైనా సూపర్ మాన్ వయసు అడిగారా? హనుమాన్ వయసు అడిగారా? మరి సేనాపతి వయసు గురించి మాత్రం ఎందుకు అడుగుతున్నారు. అతను ప్రతి చోటా ఉన్నాడు. చాలా యుగాలు దాటుకుంటూ వస్తాడు. అందుకే అతను అందరిలో కెల్లా ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి.. దేవుడు.. అంటూ కామెంట్ చేశారు కమల్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.